చారిత్రక సాలార్‌జంగ్ మ్యూజియంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కొత్తగా నిర్మించిన రెండు అధునాతన బ్లాక్‌లను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ ని సందర్శించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. 1951 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మకమైన సాలార్‌జంగ్ మ్యూజియం.. రోజురోజుకూ కొత్త కళాకృతులు, దేశ, విదేశాల చిత్రాలను ప్రదర్శిస్తూ.. 72 ఏళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటూనే ఉందన్నారు. పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటుండటం హర్షదాయకమన్నారు. ఇవాళ కూడా ఈ…
ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్‌జంగ్ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం డేను పురస్కరించుకుని హైదరాబాద్, సాలార్‌జంగ్ మ్యూజియంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి 21 వరకు, వారం రోజులపాటు వేడుకలు…