పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” చిత్రం విడుదలకు నేటితో కలిపి మరో రెండ్రోజులే ఉండడంతో సందడి నెలకొంది. ప్రస్తుతం టీం ఈ సినిమా కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. “రాధేశ్యామ్” మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, భాగ్యశ్రీ,…
‘బాహుబలి’తో ప్రభాస్, రాజమౌళి పాన్ ఇండియా సూపర్ స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారతీయ సినిమాలో అత్యధికంగా ఫాలో అవుతున్న సినీ ప్రముఖుల్లో వీరిద్దరూ ఉన్నారు. వారి రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. భవిష్యత్తులో రాజమౌళితో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నాడు అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ “రాధేశ్యామ్” మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ విషయంపై మాట్లాడుతూ క్రేజీ…
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చివరిసారిగా అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ “బెస్ట్ సెల్లర్”లో కనిపించింది. ఇందులో మిథున్ చక్రవర్తి, శ్రుతి హాసన్, అర్జన్ బజ్వా, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సోనలీ కులకర్ణి కూడా నటించారు. ప్రస్తుతం శృతి… ప్రభాస్‌తో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ చిత్రంలో నటిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేనితో నందమూరి బాలకృష్ణ “NBK 107” సినిమా…
శృతి హాసన్ ‘క్రాక్’ హిట్ తో మళ్ళీ స్టార్ హీరోయిన్ల రేసులోకి వచ్చింది. ప్రభాస్ తో “సలార్”, బాలకృష్ణ, గోపీచంద్ సినిమాతో పాటు మరిన్ని మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. సినిమాల విషయం ఇలా ఉండగా, ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం గురించి న్యూస్ కూడా తరుచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. ముఖ్యంగా ఆమె ప్రేమికుడితో కలిసి షేర్ ఛీ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక తరచుగా అభిమానులతో టచ్ లో ఉండే ఈ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. అయితే ఇందులో మరో యంగ్ హీరోయిన్ కూడా ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ‘సలార్’లో తాను నటించట్లేదని సదరు యంగ్ బ్యూటీ తాజాగా స్పష్టం చేసింది. విషయంలోకి వెళ్తే… Read Also : “RC15” క్రేజీ అప్డేట్… ప్రాజెక్ట్ లో మరో డైరెక్టర్ ఎంట్రీ…
యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి. గత రెండ్రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పుకార్లు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రాబోతోందని, హిస్టరీ రిపీట్ అవుతుందని సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అభిమానుల వరుస ట్వీట్లతో సలార్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ వార్తల గురించి మేకర్స్ ఇంకా స్పందించలేదు. దీంతో సినిమా ఒక…
ఈరోజు శృతి హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆమె నటిస్తున్న సినిమాల నుంచి కూడా పోస్టర్స్ రూపంలో ప్రత్యేక విషెస్ తెలియజేస్తున్నారు మేకర్స్. క్రమంలోనే శృతి నెక్స్ట్ పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’ నుండి ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు, ‘సలార్’లో ప్రభాస్ కు జోడిగా కనిపించనుంది శృతి. ఇక ఈ బర్త్ డే ప్రత్యేక పోస్టర్‌లో శృతిని ఆద్యగా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత వరుసగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగులను ప్రభాస్ పూర్తి చేసుకుంటున్నారు. ‘ఆదిపురుష్’ షూటింగ్‌ను కేవలం 60 రోజుల్లో పూర్తి చేశాడు. ఇటీవల కాలంలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’, ‘సలార్’ సెట్‌ల మధ్య వరుస షూటింగులతో చాలా బిజీ షెడ్యూల్ ను గడిపారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రం ప్రస్తుతం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందన్న విషయానికి ఈ సరికొత్త రికార్డును నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2021 నాటికి నంబర్ వన్ గ్లోబల్ ఆసియా సెలబ్రిటీగా ప్రభాస్ నిలిచాడు. యూకే ఆధారిత ఈస్టర్న్ ఐ వార్తాపత్రిక ప్రచురించిన ప్రపంచంలోని 50 మంది ఆసియా ప్రముఖుల జాబితాలోని తాజా ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్స్ అందరినీ వెనక్కి తోసేసి ప్రభాస్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. వార్తాపత్రిక హాలీవుడ్, సంగీత పరిశ్రమ, టెలివిజన్, సాహిత్యం, సోషల్…
దక్షిణ భారత సినిమా సూపర్ స్టార్ కమల్ హాసన్ కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కమల్ కోలుకుంటున్నట్లు సమాచారం. కమల్ హాసన్ తనకు కోవిడ్ -19 సోకింది అంటూ గురించి ట్వీట్ చేసినప్పటి నుండి ఆయన అభిమానులు కమల్ త్వరగా కోలుకోవాలని పగలు, రాత్రి ప్రార్థనలు చేస్తున్నారు. రజినీకాంత్ తో సహా పలువురు ప్రముఖులు ఆయన…