క్రేజీ ప్రాజెక్ట్స్ పై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ లెవెల్ లో స్టార్ గా నిలచిన ప్రభాస్ చిత్రాలపై ఆల్ ఇండియాలో మరింత ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘సలార్’ సినిమాలోని ఓ ఫైటింగ్ సీన్ లో పది సెకండ్ల పార్ట్ లీక్ అయింది. అది వేరే ఎవరిదో అయితే అంత హంగామా సాగేది కాదనుకోండి. ‘బాహుబలి’ సీరీస్ తరువాత అంతర్జాతీయ మార్కెట్ లోనూ చోటు సంపాదించిన యంగ్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో కలిసి చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న భారీ హైపర్ యాక్షన్ డ్రామా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు “సలార్”లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం ‘సలార్’లో మరో హీరోయిన్ కూడా నటించబోతోందని సమాచారం. మీనాక్షి చౌదరి అనే హీరోయిన్…
‘బాహుబలి’ సీరీస్, ‘సాహో’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అంతే కాదు తను చేసే ప్రతి సినిమాలో కొత్త కొత్త విషయాలను చూపిస్తూ ఇండియన్ సినిమాలో ఇంతకుముందు ఉపయోగించని కొత్త టెక్నాలజీతో ప్రయోగాలు చేస్తూ వెళుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా కోసం వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైద్రాబాద్ పూర్తి చేసిన మేకర్స్ నిన్ననే “సలార్” మూడవ షెడ్యూల్ కు సైతం ప్యాక్ అప్ చెప్పేశారు. ప్రస్తుతం ముంబైలో నాల్గవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ ఈ రోజు ముంబైలో అడుగు పెట్టింది. ఆమె తన అభిమానుల కోసం సెట్స్ నుండి ఒక చిన్న వీడియోను…
ప్రభాస్ ఇప్పుడు తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు. ‘బాహుబలి’ సీరీస్, ‘సాహో’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా షూటిం్ లతో బిజీగా ఉన్నాడు. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర పోషణ విషయంలో దర్శకుడు ఓంరౌత్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా షూటింగ్ లేకపోవడంతో ప్రభాస్ బరువులో వచ్చిన…
తెలుగు, తమిళ భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ తనయ శ్రుతి హాసన్. ఈ ఏడాది సంక్రాంతికి రవితేజ ‘క్రాక్’తో మరో హిట్ ఖాతాలో వేసుకుంది శ్రుతి. ఆ తర్వాత వచ్చిన పవన్ ‘వకీల్ సాబ్’తో మరో హిట్ పట్టేసింది. దానికి ముందు ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన ఆంథాలజీ ‘పిట్ట కథలు’లో నటించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎపిపోడ్ లో నటించింది శ్రుతి హాసన్. ఇదిలా ఉంటే ఇప్పుడు…
ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘సలార్’ లో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.. కేజీఎఫ్ ఫ్రేమ్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ దానికోసం చాలానే కసరత్తులు చేశారు. అయితే ప్రభాస్ సరసన నటించే శ్రుతిహాసన్ కు సైతం ఫైటింగ్ సీన్స్ కు స్కోప్ ఉందట.. దీనిపై ఆమె కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతోందని తెలుస్తోంది.. చాలా అనుభవం కలిగిన ట్రైనర్స్ మధ్య శ్రుతి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ డ్రామా “సలార్”. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ…
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘కేజీఎఫ్ -2’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన వెంటనే టాలీవుడ్, శాండిల్ వుడ్ లో రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కేజీఎఫ్ -2’ను ఏకంగా ఏడెనిమిది నెలలు వాయిదా వేసి, 2022 ఏప్రిల్ 14న రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమిటనేది ఒకటి కాగా, ఆ రోజున ‘కేజీఎఫ్ -2’ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘సలార్’ మూవీని విడుదల చేస్తానన్న ఇప్పటికే ప్రకటించారు.…
“సలార్” సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి అప్డేట్ వచ్చింది. సినిమాలో నుంచి “రాజమన్నార్” అనే పాత్రను రేపు ఉదయం 10:30 గంటలకు పరిచయం చేయబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో “రాజమన్నార్” ఎవరో ఊహించడం ప్రారంభించారు. కొంతమంది అది జగపతి బాబు పాత్ర అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే… “సలార్”లో మేజర్…