యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత వరుసగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగులను ప్రభాస్ పూర్తి చేసుకుంటున్నారు. ‘ఆదిపురుష్’ షూటింగ్‌ను కేవలం 60 రోజుల్లో పూర్తి చేశాడు. ఇటీవల కాలంలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’, ‘సలార్’ సెట్‌ల మధ్య వరుస షూటింగులతో చాలా బిజీ షెడ్యూల్ ను గడిపారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయడానికి ఒక లాంగ్ షెడ్యూల్ ఉంది. చివరి షెడ్యూల్ జనవరి 2022లో ప్రారంభమవుతుంది. ‘సలార్’ని త్వరగా పూర్తి చేసి, ఆ ప్రాజెక్ట్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని ప్రభాస్ ఆసక్తిని కనబరుస్తున్నాడు.
Read Also : అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే… ‘ఖిలాడీ’ పెప్పీ పార్టీ సాంగ్
ఇందులో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ‘సలార్’ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొదట 2022 వేసవిలో విడుదలకు ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా అనుకున్న సమయానికి సినిమా విడుదలలో జాప్యం జరుగుతోంది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. ‘రాధే శ్యామ్’ని 2022 సంక్రాంతికి విడుదల చేస్తుండగా, ‘ఆదిపురుష్’ ఆగష్టు 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తరువాత ప్రభాస్ కూడా సందీప్ వంగా దర్శకత్వంలో ఒక చిత్రానికి సంతకం చేసాడు. ఈ చిత్రం 2023లో ప్రారంభం కానుంది.