యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. అయితే ఇందులో మరో యంగ్ హీరోయిన్ కూడా ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ‘సలార్’లో తాను నటించట్లేదని సదరు యంగ్ బ్యూటీ తాజాగా స్పష్టం చేసింది. విషయంలోకి వెళ్తే…
Read Also : “RC15” క్రేజీ అప్డేట్… ప్రాజెక్ట్ లో మరో డైరెక్టర్ ఎంట్రీ !
యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం తన కొత్త చిత్రం “ఖిలాడీ”ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్‌కి రవితేజ హాజరు కాకపోవడంతో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే బాధ్యతను హీరోయిన్లు మీనాక్షి, డింపుల్ తీసుకున్నారు. మీడియా మీట్‌లలో పాల్గొంటున్న మీనాక్షి తన అందచందాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాలోని లిప్ కిస్ సీన్ గురించి ఆమె మాట్లాడుతూ స్క్రిప్ట్, పాత్ర డిమాండ్ చేసినప్పుడు అలాంటి సన్నివేశాలలో నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న మరో పెద్ద రూమర్‌పై క్లారిటీ ఇచ్చింది. మీనాక్షిని ‘సలార్’లో ఒక ప్రత్యేక పాత్ర కోసం తీసుకున్నారని ఒక పుకారు వచ్చింది. అయితే ఆ సినిమాలో ఏ పాత్ర కోసం తనను ఎవరూ సంప్రదించలేదని ‘ఖిలాడీ’ బ్యూటీ స్పష్టం చేసింది.
ఇక ‘ఖిలాడీ’ ఈ నెల 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సలార్’ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి డబ్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘సలార్’ షూటింగ్ దశలో ఉంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.