యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి. గత రెండ్రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పుకార్లు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రాబోతోందని, హిస్టరీ రిపీట్ అవుతుందని సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అభిమానుల వరుస ట్వీట్లతో సలార్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ వార్తల గురించి మేకర్స్ ఇంకా స్పందించలేదు. దీంతో సినిమా ఒక భాగమా? రెండు భాగాలా? అనే విషయంపై చర్చ నడుస్తోంది. కాగా ‘సలార్’లో భావోద్వేగాలతో కూడిన హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయట. మిలిటరీ ట్యాంకులు, జీప్‌లు, రైఫిల్స్, మెషిన్ గన్‌లు, విమానాలను కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో ఉపయోగిస్తున్నారట. ఇందులో క్లైమాక్స్ సీన్ కోసమైతే ఏకంగా 80 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Read Also : వి వాంట్ “భీమ్లా నాయక్” అప్డేట్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి డబ్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘సలార్’ షూటింగ్ దశలో ఉంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.