శృతి హాసన్ ‘క్రాక్’ హిట్ తో మళ్ళీ స్టార్ హీరోయిన్ల రేసులోకి వచ్చింది. ప్రభాస్ తో “సలార్”, బాలకృష్ణ, గోపీచంద్ సినిమాతో పాటు మరిన్ని మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. సినిమాల విషయం ఇలా ఉండగా, ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం గురించి న్యూస్ కూడా తరుచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. ముఖ్యంగా ఆమె ప్రేమికుడితో కలిసి షేర్ ఛీ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక తరచుగా అభిమానులతో టచ్ లో ఉండే ఈ భామ తాజాగా కొత్త ఇంటర్వ్యూలో తన గురించి చాలా గూగుల్ లో వచ్చిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అందులో శృతి హాసన్ ఆస్తి ఎంత ? ఆమె ఫోన్ నంబర్, నెట్ వర్త్, రిలేషన్ షిప్ స్టేటస్ వంటి ఇతర విషయాలు కూడా ఉన్నాయి.
Read Also : Anasuya : ప్చ్… ఇంత గ్లామర్ ఒలికించినా వేస్ట్ అయ్యిందే !
శృతి రిలేషన్షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ “ఓహ్… తదుపరి ప్రశ్న ఏమిటో నాకు తెలుసు… శృతి హాసన్ బాయ్‌ఫ్రెండ్ శాంతాను హజారికా ఎవరు? ఎందుకంటే నేను దీన్ని గూగుల్ చేసాను… శాంతనుతో సంబంధం ఉన్న మొత్తం వరుస ప్రశ్నలు నిజంగా చాలా ఉల్లాసంగా ఉంటాయి. వాటిని చూసి నేను నవ్వుతూనే ఉంటాను. అవును నేను డేటింగ్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన ఆస్తి మొత్తం ఎంత ? అని అడిగిన ప్రశ్నకు “శృతి హాసన్ ఇంకా దానిని కనుగొంటోంది.. కానీ అది మరింత ఎక్కువ కావాలని ఆమెకు తెలుసు” అంటూ సమాధానం చెప్పకుండా తప్పించుకుంది.