Ponnam Prabhakar: ఆర్టీసి సిబ్బంది, ఆర్టీసి బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని రవాణా, బీసీ సంక్షేమం శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఆర్టీసీ కొత్త 80 బస్సులను జెండా ఊపి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగిందన్నారు. బస్సులపై ఓవర్ లోడ్ అవుతున్న విషయం మా దృష్టికి వచ్చిందన్నారు. వాటిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామన్నారు. పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లుకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి బస్సుల చార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలు ఉచిత ప్రయాణం కల్పించారన్నారు. ఉచిత టికెట్ మీద ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారన్నారు. 1050 కొత్త బస్సులు 400 కోట్లతో కొనుగోలు చేస్తున్నామన్నారు. ఖాకీ బట్టలతో ఉన్న ఆర్టీసి సిబ్బంది సంస్థను కాపాడుకుంటున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసి బలోపేతానికి కృషి చేస్తామన్నారు. సీసీఎస్ బకాయిలు దశల వారీగా విడుదల చేస్తామని తెలిపారు.
Read also: Komrelly Mallanna: మల్లన్న మూలవిరాట్ దర్శనం రద్దు.. మళ్ళీ ఎప్పుడంటే..?
ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి సిబ్బంది సంయమనంతో ఉండాలని తెలిపారు. ఆర్టీసిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ పరిష్కరించకుందామన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఆర్టీసి ముందుకు తీసుకెళ్దాం, కాపాడు కుందామన్నారు. ఒక ఆర్టీసీ కొత్త బస్సుల ప్రారంభ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ మెరుగైన ప్రయాణం కోసం కొత్త బస్సులు ప్రారంభిస్తుందన్నారు. 400 కోట్లతో 80 కొత్త బస్సులు ప్రారంభిస్తామన్నారు. 1000 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మే, జూన్ వరకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. మహిళల కోసం ఉచిత ప్రయాణం తీసుకొచ్చింది ప్రభుత్వం అన్నారు. ఈ 21 రోజుల్లో మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసి సిబ్బంది ఎంతో కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. వచ్చే రోజుల్లో ఓపికతో ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలన్నారు. ఇప్పటికీ ఆరు కోట్ల ఉచిత టికెట్ లు విక్రయించామన్నారు. కండక్టర్, డ్రైవర్లకు ప్రయాణికులు సహకరించాలని తెలిపారు. దాడులు చేయకూడని తెలిపారు.
Hyderabad Gold ATM: అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో గోల్డ్ ATM.. ఎన్ని గ్రాములు కొనచ్చంటే?