కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనుకు ఊరట.. బెయిల్ మంజూరు విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు అతనికి షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదేళ్ల తర్వాత శ్రీనుకు బెయిల్ లభించింది. కాగా.. ఈ కేసుపై మీడియాతో మాట్లాడద్దొని నిందితుడికి న్యాయస్థానం ఆదేశించింది. రూ.25 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మడివరం పోలీస్ స్టేషన్…
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అమిత్ షాను కలిశారు.. సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రధానిని కలుస్తున్నారని అన్నారు. పొత్తుల గురించి వెంపర్లాడటం చూస్తే టీడీపీ ఎంత బలహీనంగా ఉందనేది బయటపడుతోందని విమర్శించారు. టీడీపీకి బలముంటే పొత్తుల కోసం ఎవరి వెంట పడాల్సిన అవసరం ఉండదని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ ఐదో జాబితాను విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఇంఛార్జుల మార్పును ప్రకటించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రచారం గురించి ఇప్పుడే పట్టించుకోవటం లేదని, ప్రజలకు పథకాలు అందించే విషయం పైనే ఫోకస్ పెట్టారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఎవరి ఊహకు కూడా అందని విషయమని, గతంలో ఇలాంటివి జరిగాయా? అని ప్రశ్నించారు. సీఎం వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చారని, పారదర్శకంగా పథకాలు అందుతున్నాయన్నారు. 2024 ఎన్నికలకు జనవరి 27 నుంచి భీమిలి నుంచి…
మంత్రి గుడివాడ సీటుపై అధిష్టానం క్లారిటీ.. అక్కడి నుంచి పోటీ..! రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జ్ మార్పు కసరత్తులు చేస్తుండగా.. పార్టీ గెలవలేని చోట గెలిచే అభ్యర్థిని ఖరారు చేస్తుంది అధిష్టానం. ఈ క్రమంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నాడో తెలిపింది. అతని సీటుపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ఈసారి పెందుర్తి నుంచి అమర్నాథ్ పోటీ చేయనున్నారు. పెందుర్తిలో కాపు, వెలమ ఓట్లు…
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు, అంగన్ వాడీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు ప్రభుత్వంతో కలిసి పలుమార్లు చర్చించినప్పటికీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీలతో అనేక దఫాలుగా చర్చలు జరిపాం.. అయినా సమ్మె కొనసాగిస్తున్నారన్నారు. అందుకే ఎస్మా పెట్టామని తెలిపారు. కొంతమంది అంగన్వాడీ వర్కర్లు నాయకులు ఆడియో మెసేజ్ లు బయటకు వచ్చాయి.. వీటిలో రాజకీయ అజెండా కనిపించిందని సజ్జల తెలిపారు.…
కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. ప్రజలా? కుటుంబమా అన్న ప్రశ్న వస్తే మా ముఖ్యమంత్రి ఛాయిస్ ప్రజలేనని తెలిపారు. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్ళీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు? అని సజ్జల ప్రశ్నించారు. వివేకానందా రెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.. ఫలితం ఏమయ్యిందని అన్నారు. కాగా.. జగన్…