గత కొన్ని రోజలు నుంచి ఏపీలోని ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం పీఆర్‌పీ స్పష్టత ఇవ్వాలంటూ.. అంతేకాకుండా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యం నిన్న సీఎస్ సమీర్‌శర్మ సీఎం జగన్‌కు పీఆర్‌ఎస్‌పై నివేదికను అందించారు. అంతేకాకుండా 72గంటల్లో జగన్ తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంల ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి…
ఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం నిరసనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా విజయవాడలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఆర్సీ సహా న్యాయమైన 71 డిమాండ్లను పరిష్కరిస్తేనే పోరాటం ఆపుతామని వారు స్పష్టం చేశారు. సచివాలయ…
ఏపీలో మరోసారి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణ విముక్తి విషయంలో ఏమి జరిగిందో, లక్ష కోట్లు 20 వేల కోట్లు ఎలా అయ్యాయో అందరికీ తెలుసునని అన్నారు. అంతేకాకుండా మీడియా ముసుగులో దశబ్దాలు తరబడి టీడీపీ కోసం రౌడీయిజం, రుబాబు చేస్తున్నారని, చంద్రబాబు వస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలను రోజూ…
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అయితే నేడు మీడియాతో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆ గట్టా…ఈ గట్టా…? అంటూ ప్రశ్నించారు. మేమైతే పవన్ బీజేపీతోనే ఉన్నారని అనుకుంటున్నామని, ఆయన చేయగలిగింది కూడా ఉందని, జగన్ ఇచ్చిన సలహాలు పరిగణలోకి తీసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపండి అని కొరొచ్చునని సూచించారు. మోడీకి ఒక వినతి ఇచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి అంటూ ఆయన…
ఏపీలో ఓటీఎస్‌పై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వన్ టైం సెటిల్‌మెంట్ అంటూ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకంపై మీడియా పేరుతో కొన్ని సంస్థలు టెర్రరిజం చేస్తున్నాయంటూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని, ఈ పథకం వల్ల పేదలకు జరిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. గత టీడీపీ ప్రభుత్వం కనీసం వడ్డీ…
చంద్రబాబుపై మరోమారు ఫైర్ అయ్యారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. చంద్రబాబు కుప్పంను కబ్జా చేసి కోటలాగా మార్చుకున్నాడని… కుప్పంలో చంద్రబాబును దారుణం ఓడించారని ఆగ్రహించారు. అమరావతి యాత్ర ప్రజల యాత్ర కాదు.. టీడీపీ నేతలే యాత్ర చేస్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబుకు ఎక్కడో చోట గొడవ కావాలి.. అదే ఆయన రాజకీయం అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని ఆగ్రహించారు. అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాజకీయ పదవుల్లో కూడా…
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని కలిశారు పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్లు. గతంలో ట్రాన్స్ రాయ్ సంస్థకు సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేసి మోసపోయామని ఫిర్యాదు చేసారు 120 మంది సబ్ కాంట్రాక్టర్లు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 20 కోట్లు పైనే ఖర్చు చేసినా బిల్లులు మంజూరు చేయలేదని ఫిర్యాదు చేసారు. అప్పటి నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమ చేతిలో తాము మోసపోయామని తెలిపారు కాంట్రాక్టర్లు. ఆర్దికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన…
చంద్రబాబుకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్ పై విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు కు లేదని ఫైర్ అయ్యారు సజ్జల. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని.. సీఎం జగన్ చొరవతో ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. ఓటీఎస్ పై ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు కోరారంటే దాన్ని ఏమనాలో వారే ఆలోచించుకోవాలని చురకలు అంటించారు. ఓటీఎస్ పథకంలో పేదలకు నష్టం కల్గించేది అంటూ ఏదీ…
టీడీపీ అధినేత చంద్రబాబు డా.బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయంటూ వైసీపీ ప్రభుత్వ ఆ హక్కులను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఉరి వేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలకు కౌంటర్ గా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం ఉంది.. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో దేశంలో భిన్నత్వం ఉంటుంది.. అందరినీ ఒకే తాటిపై నడిపించే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేశారు.. వర్ణ, కుల…