ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్దంగా ఉన్నామని, అవసరమైతే ఓ నాలుగు మెట్లు దిగడానికైనా సిద్దమన్నారు. చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయని, పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామని, పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్దమేనని ఆయన వెల్లడించారు. చర్చలకు…
ఉత్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుంచి చర్చలు జరిపేందుకు సిద్ధంగ ఉన్నామని సంప్రదింపుల కమిటీ సభ్యులు సజ్జల రామకృష్ణ రెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. దానిలో భాగంగా వారిని రావల్సిందిగా నిన్న సమాచారం ఇచ్చాం. జీవోలను అభయన్స్‌లో పెట్టాలని కోరారు. కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని వారు వెల్లడించారు. అయితే…
ఎన్ని రోజుల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పీఆర్పీ ప్రకటనపై తెరపడింది. ఈ రోజుల సీఎం జగన్ పీఆర్సీపీపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ విషయానికి క్లారిటీ ఇచ్చామని, ఎన్నికల్లో చెప్పినట్టుగానే 27 శాతం ఐఆర్ ఇవ్వడం చరిత్ర అని ఆయన అన్నారు. శతాబ్దంలోనే జరగని పరిణామాలు, నష్టాలు కోవిడ్ వల్ల వచ్చాయని ఆయన అన్నారు. 2020 నుంచి 2022 వరకు కోవిడ్ ప్రభావం ఉంది.. ఈ ఏడాది కూడా…
పాత తెలుగు సినిమాల్లో శాపనార్థాలు పెట్టే సీన్ రిపీట్ అయింది. చంద్రబాబు రెండు గంటల ప్రసంగంలో శాపాలు పెట్టడమే సరిపోయింది. చంద్రబాబు స్పీచ్ తో కార్యకర్తలకు కూడా ఊపు రావటం లేదు. ముందు కుప్పంలో నాయకత్వం మార్చాలి. చంద్రబాబు విఫల నాయకుడు. టీడీపీ ఓ విఫల పార్టీ. ప్రయత్నం కూడా చేయకుండా అప్పనంగా అధికారం రావాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
రాష్ట్ర ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ బాధ్యత ఈ ఏడాది నుంచి మరింతగా పెరుగుతుందన్నారు. వైసీపీ పాలనకు 30 నెలలు పూర్తియిందన్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పటికీ మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ వందకు వందశాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. క్యాలెండర్ డేట్స్‌తో సహా అన్ని పథకాలను చెప్పినవాటి చెప్పినట్టుగా పూర్తి చేశామన్నారు. Read Also:ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సజ్జనార్…
11వ పీఆర్సీపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానుంది. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. సీఎస్ సమీర్ శర్మకూడా ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలో పీఆర్సీపై ముచ్చటించారు. అయినప్పటికీ పీఆర్సీపై స్పష్టత నెలకొనలేదు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్‌తో భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా…
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభ, నేతలు చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… టీడీపీ ఎజెండా ప్రకారమే బీజేపీ సభ నిర్వహించిందన్న ఆయన.. టీడీపీ, బీజేపీ, జనసేన… ఒకరు రాగం అందుకుంటే… మరొకరు పల్లవి అందుకుంటారు అంటూ సెటైర్లు వేశారు. ఎవరైనా ప్రజల సమస్యలపై మాట్లాడితే మేం సమాధానం ఇస్తాం.. కానీ, అలా కాకుండా వాళ్లే దేవాలయాలు కూలగొట్టేయటం, వాళ్లే ఆరోపణలు చేయటం రాజకీయమే అన్నారు. రాష్ట్రంలో…
పీఆర్సీ ప్రకటనపై ఓవైపు ఉద్యోగులు ఎదురుచూస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ కసరత్తు కొనసాగుతూనే ఉంది.. ఇవాళ పీఆర్సీ పై మూడు గంటలకు పైగా సమావేశం జరిగింది.. సీఎం జగన్ నేతృత్వంలో ఆర్ధిక శాఖ అధికారుల సమావేశం నిర్వహించారు.. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు తదితరులు హాజరయ్యారు.. ఇక, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఆర్ధిక శాఖకు సంబంధించిన సమావేశంలో పీఆర్సీపై చర్చ జరిగిందని…
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ వేడకలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు హజరయ్యారు. జగన్ జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను సజ్జల ప్రారంభించారు. రక్తదానం, వస్త్రాల పంపిణీ వంటి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేపట్టారు. అన్ని మతాల మత పెద్దలు ప్రార్ధనలు చేశారు.అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్ కు…