సీఎం జగన్ పై మేము చాలా నమ్మకంతో ఉన్నాం : బండి శ్రీనివాస రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్‌సీ ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలతో విడివిడిగా చర్చలు కొనసాగిస్తున్నారు. ముందుగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సజ్జల, తరువాత ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస రావు మాట్లాడుతూ..11వ పీఆర్సీ అంశాలు సహా 70 డిమాండ్లు అమలు పై సజ్జలతో చర్చించామని, మా డిమాండ్లను సీఎం వద్దకు తీసుకెళ్లతామన్నారని ఆయన వెల్లడించారు. సీఎం జగన్ పై మేము చాలా నమ్మకంతో ఉన్నామని, సీఎస్ ఇచ్చిన ప్రతిపాదనలు మాకు మేలు చేసే పీఆర్సీ కాదన్నారు.
సీఎస్ కమిటీ సిఫార్సులు ప్రభుత్వానికి మేలి చేసేదే కాని, ఉద్యోగులకు మేలు చేసేది కాదని చెప్పామన్నారు. ప్రతిపాదనలు అమలు చేస్తే ఉద్యోగుల ఉనికికే ప్రశ్నార్థకం అవుతుందని, ఉద్యోగులకు 55 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సజ్జలను కోరామన్నారు. హామీలు అమలయ్యే వరకు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశామన్నారు. – అశుతోష్ మిశ్రా పీఆర్సీ నివేదికను యథాతథంగా అమలు చేయాలని కోరామని, సీఎం మా డిమాండ్లకు సానుకూలంగా ఉన్నారని భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా నిరాశ నిస్పృహలోకి వెళ్లిన ఉద్యోగులకు సంతోషం కల్గించే వార్త సీఎం చెబుతారని ఆశిస్తున్నామని, మాకు 14.29శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎస్ కమిటీ చెప్పడం సరైంది కాదన్నారు. 1-7-2018 నుంచి 55శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలన్నదే మా డిమాండ్ అని, ఎంత ఫిట్ మెంట్ ఇస్తారనేది సీఎం ఇష్టమన్నారు.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?