కరోనా-లాక్ డౌన్ అల్లు అరవింద్ ఓటీటీ ‘ఆహా’కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇందులో చాలా వరకు చిన్న సినిమాలు, సిరీస్‌లే. నిజానికి చాలా వరకూ డబ్బింగ్ సినిమాలే. ఇప్పటి వరకూ ఆహాలో రిలీజైన పెద్ద తెలుగు సినిమా ‘క్రాక్’ మాత్రమే. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు నిల్. ఇప్పుడు వరుసగా పేరున్న నటీనటులు, టెక్నీషియన్లతో వెబ్ సిరీస్ తీస్తూ… థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్‌కు కొన్ని పెద్ద సినిమాలను ఆహాలోకి…
నేచురల్‌స్టార్ నాని నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘టక్ జగదీశ్’ విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో క్రేజీ మూవీ శ్యామ్‌సింగరాయ్ సెట్స్ పై ఉంది. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. తాజాగా జూలై 1 నుండి చివరి షెడ్యూల్ ను ప్రారంభించారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సారథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో నిర్మించిన భారీ కోల్‌కతా సెట్ భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ఆ సెట్‌ను పునర్నిర్మించి…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ ఎత్తివేయడంతో పాటు సినిమా థియేటర్లును కూడా తెరుచుకోవచ్చు అని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా ప్రేమికులు రెండు నెలల తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ సినిమా థియేటర్ యాజమాన్యాలు మాత్రం పెద్ద సినిమాలు వచ్చేదాకా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలోను థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొత్త సినిమాలు విడుదల తేదీలను ప్రకటించే పనిలో పడ్డాయి. అయితే థియేటర్లు…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సౌత్ లో చేసింది చాలా తక్కువ సినిమాలే. అయినప్పటికీ ఆమె అభినయానికి, డ్యాన్స్ కు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో ఆమె నటించిన సాంగ్స్ కు వచ్చినంత అద్భుతమైన రెస్పాన్స్ స్టార్ హీరోల సాంగ్స్ కు సైతం రాలేదంటే అతిశయోక్తికాదు. తాజాగా సాయి పల్లవి మరో సాంగ్ రికార్డు క్రియేట్ చేసే విషయంలో “తగ్గేదే లే” అంటూ దూసుకెళ్తోంది. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి…
టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ తో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ గా రౌడీ బేబి సాయి పల్లవి నటించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “ఫిదా, లవ్ స్టోరీ” చిత్రాలలో సాయి పల్లవి నటించింది. ఇప్పుడు వస్తున్న వార్తలు గనుక నిజమైతే ఈ చిత్రం శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ…
దక్షిణాది భామలు బాలీవుడ్ లో తమ సత్తాను చాటుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముందుగా టాలీవుడ్ లో పరిచయమైన ఇలియానా, తాప్సి తదితరులు బాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణించారు. ఇటీవల కన్నడ సోయగం రష్మిక మందన్న రెండు హిందీ ఆఫర్లను దక్కించుకుంది. “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″తో సమంత కూడా నార్త్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజా సమాచారం ప్రకారం సౌత్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవికి బాలీవుడ్ లో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సాయి…
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ”. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నెల చివరి తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి అనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. లవ్ స్టోరీ విడుదల విషయంలో పలు…
‘‘ఇంత కాలం ‘తెల్ల’బోయింది చాలు! ఇక మీదట వద్దు’’ అంటోంది అవికా గోర్! ఆమె వద్దకి వచ్చిన ఓ బ్రాండ్ ఎండార్స్ మెంట్ ని సెకండ్ థాట్ లేకుండా రిజెక్ట్ చేసిందట. ఆమె ప్రమోట్ చేయాల్సింది ఫెయిర్ నెస్ ప్రాడక్ట్ కావటంతో గట్టిగా ‘నో’ చెప్పేసిందట. భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా ‘చిన్నారి పెళ్లికూతురు’ ఛాన్సే లేదని చెప్పేశానంటూ స్వయంగా తెలిపింది! నల్లటి వార్ని తెల్లగా చేస్తామని బయలుదేరే ఫెయిర్ నెస్ క్రీముల పట్ల జనాల్లో…
ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన మలయాళ చిత్రం ‘అతిరన్’ ను తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ అమాంతం ఉత్కంఠభరితంగా ఉంది. మానసిక సమస్యతో బాధపడే పాత్రలో సాయి పల్లవి నటన ఆకట్టుకుంటుంది. ఓ బంగ్లా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఫహద్ ఫాజిల్, సాయి పల్లవిల నటన ఈ ట్రైలర్ లో హైలైట్…
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘లవ్ స్టోరి’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్ని ఆకట్టుకోగా రికార్డ్స్ కూడా సృష్టిస్తున్నాయి. ఇక తెలంగాణ జానపదంను గుర్తుచేస్తూ వచ్చిన ‘సారంగ దరియా’ పాట…