హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘శ్యామ్‌సింగరాయ్’ ఫైనల్ షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్‌స్టార్ నాని నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘టక్ జగదీశ్’ విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో క్రేజీ మూవీ శ్యామ్‌సింగరాయ్ సెట్స్ పై ఉంది. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. తాజాగా జూలై 1 నుండి చివరి షెడ్యూల్ ను ప్రారంభించారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సారథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో నిర్మించిన భారీ కోల్‌కతా సెట్ భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ఆ సెట్‌ను పునర్నిర్మించి కొన్ని కీలక సన్నివేశాలను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు. నాని సహా ఇతర తారాగణం ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో నాని లుక్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్‌లుక్ పోస్టర్, ఇటీవల రిలీజైన సాయిపల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఒక యూనిక్ స్టోరీతో తెలుగు ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విధంగా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారని నిర్మాత వెంకట్ బోయనపల్లి తెలిపారు. ఫస్ట్‌టైమ్ నాని, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీలో నాని సరికొత్త రూపాలలో కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం, జీస్సూసేన్ గుప్తా, లీలా స్యామ్‌సన్, మణీశ్ వడ్వ కనిపించబోతున్నారు. సత్యదేవ్ జంగా కథను అందించిన ‘శ్యామ్ సింగరాయ్’కు మిక్కీ జే మేయర్ స్వర రచన చేస్తున్నారు. శాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
Also Read
Shyam is back 🙂
Last schedule begins 🔥#ShyamSinghaRoy pic.twitter.com/crTtJCJO0s— Nani (@NameisNani) July 1, 2021
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!