“లవ్ స్టోరీ”ని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో ఏమో కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పటికే 2021 ఏప్రిల్ 16 విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత సెప్టెంబర్ 10 అన్నారు. వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని సంబర పడిన ప్రేక్షకుల ఆనందాన్ని ఆవిరి చేస్తూ సెప్టెంబర్ 24కు సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఎట్టకేలకు “లవ్ స్టోరీ” ఈ నెల…
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన ‘లవ్ స్టోరి’ సినిమా ఈనెల 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల పోస్టర్లు, టీజర్, పాటల ద్వారా సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక నిన్న విడుదల అయినా ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ఇకపోతే సెన్సార్ సభ్యులు కూడా శేఖర్ కమ్ముల సినిమాను ప్రశంసించారు. ఈమేరకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసరికి 2 గంటల…
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. అప్పటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమా విడుదల గురించి…
అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. విశేషం ఏమంటే అది అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రేమ్ నగర్’ మూవీ విడుదలైన రోజు. సరిగ్గా ఈ యేడాది సెప్టెంబర్ 24వ తేదీకి ‘ప్రేమ్ నగర్’ మూవీ విడుదలై 50 సంవత్సరాలు పూర్తవుతుంది. సో… ఈ శుభదినాన ఆయన మనవడు నాగ చైతన్య సినిమా ‘లవ్ స్టోరీ’ విడుదల కావడం కాకతాళీయమే అయినా అక్కినేని అభిమానులంతా ఆనందించే అంశమిది. చిత్రం ఏమంటే……
నిప్పు లేనిదే పొగరాదని కొందరంటారు. కానీ మీడియా నిప్పులేకుండానే పొగను సృష్టిస్తుందని మరికొందరు వాపోతుంటారు. అయితే ఫిల్మ్ సెలబ్రిటీస్ చేసే కొన్ని పనులు చూస్తే… అవి నిప్పులేకుండానే పొగను సృష్టించడం కాదనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంజరంలో తాను ఉండలేని నర్మగర్భంగా ఓ మీడియా సంస్థకు సమంత చెప్పిందనే వార్తలు రావడంలో అందులో నిజం ఉందని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత…
యంగ్ టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సాయిపల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా లవ్ స్టోరీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సన్నివేశాలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. శేఖర్ కమ్ముల మార్క్ సినిమా అయినప్పటికీ ట్రైలర్ మాత్రం చాలా ఫ్రెష్ గా మలిచారు. సాధారణంగా ప్రేమకథ చిత్రాలు చూడ్డానికి యూత్ ఎక్కువగా…
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘విరాట పర్వం’. ఈ సినిమా షూటింగ్ పూర్తయియ్యే చాలా రోజులే అవుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయినా కూడా విరాటపర్వంపై ఎలాంటి అప్డేట్ లేదు. ఆయా సినిమాలు కొత్త పోస్టర్లు, పాటలు విడుదల చేస్తూ కుదిరితే విడుదల తేదీలు కూడా ప్రకటిస్తున్నాయి. అయితే విరాటపర్వం నుంచి మాత్రం సెకండ్ వేవ్ తర్వాత…
యంగ్ టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన “లవ్ స్టోరీ” విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో “లవ్ స్టోరీ” ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా చై కొద్దిసేపటి క్రితం ట్విట్టర్లో సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించాడు. “సెప్టెంబర్ 13 న…
తెలుగు చిత్రపరిశ్రమ అంటేనే సెంటిమెంట్స్ కి నిలయం. ఇక ఇక్కడ విఘ్నాలు తొలిగించే వినాకుడికి మొక్కకుండా ఎవరూ ముందడుగు వేయరు. అలాంటిది విఘ్నేశ్వరుడుకి సంబంధించి మిస్టేక్ చేస్తే విఘ్నం ఏర్పడకుండా ఉంటుందా!? అదే జరిగింది ‘లవ్ స్టోరీ’ సినిమా విషయంలో. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేకర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మించాయి. కోవిడ్ కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు వినాయక చవితి కానుకా సెప్టెంబర్ 10న…
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. కోవిడ్ కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న ఖచ్చితంగా విడుదలవుతుందని భావించారు. ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే నాని నటించిన ‘టక్ జగదీష్’ అదే రోజున ఓటీటీలో విడుదల కానుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లు, సినిమా థియేటర్లలో…