సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంపై ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా వున్నా.. సినిమా వాయిదా పడుతుండటంతో నిరుత్సాహ పడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లో సినిమాలు ఆడుతున్న ఎప్పుడో రావాల్సిన లవ్ స్టోరీ చిత్రం ఇంకా రాకపోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్ ను అప్డేట్ కోరుతున్నారు. ఇక ఓటీటీ వస్తుందోనన్న అనుమానాలను నిర్మాతలు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు.. లవ్ స్టోరీ చిత్రం ‘వినాయక చవితి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 10వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.