నేచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “శ్యామ్ సింగ రాయ్” చిత్రానికి మేకర్స్ గుమ్మడికాయ కొట్టేశారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం కోల్‌కతా నేపథ్యంలో సెట్ చేయబడింది. నాని బెంగాలీ లుక్ ఉన్న ఫస్ట్ లుక్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. కోవిడ్-19 కారణంగా చిత్రం చివరి షెడ్యూల్ వాయిదా పడింది. లేదంటే సినిమా చిత్రీకరణ ఒక నెల క్రితమే పూర్తయ్యేది. ఇక షూటింగ్ పూర్తయిన సందర్భంగా నాని “గొప్ప బృందంతో షూటింగ్ పూర్తి చేశాము. మంచి ఫలితం వస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం” అంటూ ట్వీట్ చేశారు.
Read Also : బాలకృష్ణ సినిమాల ఆర్డర్ ఇదే!
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఓ యూనిక్ కాన్సెప్ట్‌తో ‘శ్యామ్‌సింగ రాయ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత చిత్రాలకు భిన్నమైన సరికొత్త గెటప్స్‌లలో నేచురల్ స్టార్ నాని కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు. జీస్సూసేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
Shoot done 🙌
— Nani (@NameisNani) July 26, 2021
With a great team comes the great outcome🔥
Post production begins 🙂#ShyamSinghaRoy pic.twitter.com/SvgUdfqmVZ