FIFA World Cup: క్రికెట్లో టీమిండియా ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు ఎంత క్రేజ్ ఉందో.. ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీకి కూడా అంతే క్రేజ్ ఉంది. వీళ్లిద్దరూ తమ ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే వీళ్లిద్దరికీ అనేక సారూప్యతలు ఉన్నాయి. క్రికెట్లో సచిన్ జెర్సీ నంబర్ 10 అయితే.. ఫుట్‌బాల్‌లో మెస్సీ జెర్సీ నంబర్ కూడా 10. వీళ్ల మధ్య ఇంకా చాలా పోలికలు కనిపిస్తున్నాయి. 2003లో ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత మళ్లీ…
Team India: వన్డే ఫార్మాట్లో టీమిండియా అరుదైన రికార్డు సృష్టించింది. వన్డే చరిత్రలో 300 వ్యక్తిగత సెంచరీలు చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 240 వ్యక్తిగత సెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్ 214 వ్యక్తిగత సెంచరీలతో మూడో స్థానంలో, 194 వ్యక్తిగత సెంచరీలతో వెస్టిండీస్ నాలుగో స్థానంలో, 191 వ్యక్తిగత సెంచరీలతో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో, 188 వ్యక్తిగత సెంచరీలతో ఇంగ్లండ్ ఆరో…
Top Five Sportswear in the World: సచిన్ టెండుల్కర్ని చూస్తే ఎంఆర్ఎఫ్ బ్రాండ్ గుర్తుకొస్తుంది. సానియా మీర్జా కనపడగానే జీవీకే కంపెనీ పేరు కళ్ల ముందు కదులుతుంది. క్రీడాకారులు ధరించే బ్రాండ్స్‌కి ఆ రేంజ్లో గుర్తింపు వస్తుంది. ఆయా సంస్థలు ప్రపంచం మొత్తం తెలిసిపోతాయి. అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ ఫీల్డ్‌లో లేరు. రిటైర్ అయ్యారు. కానీ.. ఇతర ప్లేయర్లు కొందరు వాళ్ల రేంజ్‌లోనే అభిమానులను అలరిస్తున్నారు. తద్వారా కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
Road Safety World Series: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా లెజెండ్స్ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లకు 217 పరుగులు చేసింది. రిటైర్ అయినా తమలో సత్తా తగ్గలేదని పలువురు ఆటగాళ్లు నిరూపించారు. సచిన్(16), నమన్ ఓజా(21), రైనా(33), యువరాజ్(6) పరుగులు చేయగా.. స్టువర్ట్ బిన్నీ మాత్రం చెలరేగిపోయాడు. 42 బంతుల్లోనే 6 సిక్సులు, 5 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. చివర్లో యూసఫ్ పఠాన్ 15…
సెలెబ్రిటీ స్టేటస్ ఉన్నవారు ఎవరితోనైనా కాస్త సన్నిహితంగా మెలిగినా, కనీసం కలిసి ఫోటో దిగినా.. ఆ ఇద్దరి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే రూమర్లు పుట్టుకొచ్చేస్తాయి. ఇప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌పై అలాంటి రూమర్లే తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో అతను సన్నిహితంగా ఉన్న ఫొటో ఒకటి నెట్టింట్లో దర్శనమిచ్చింది. అందులో అర్జున్, వ్యాట్ కాస్త చనువుగా ఉండటాన్ని గమనించవచ్చు. అంతే, అది చూసిన నెటిజన్లు…