ఒకప్పుడు జట్టులో సచిన్ టెండూల్కర్ ఉంటే చాలు.. చింతించాల్సిన అవసరం లేదని చెప్పుకునే వారు. అంతటి గొప్ప ఆటగాడు ఆ మాస్టర్ బ్లాస్టర్. ఆయన క్రీజులో అడుగుపెట్టాడంటే.. బౌలర్లందరికీ హడల్. అందుకే, ముందుగా ఆయన్నే ఔట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకునేవారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా పెవిలియన్ పంపాలని.. రకరకాల వ్యూహాలకు పాల్పడేవారు. తానూ అలాంటి వ్యూహమే 2006లో రచించానని, కానీ అది ఫలించలేదని తాజాగా ఓ సీక్రెట్ రివీల్ చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్.…
ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచు లో ఇంగ్లండ్ అదరగొట్టింది. మూడు టెస్టుల సిరీస్ లోని తొలి టెస్ట్ మ్యాచ్ లో రూట్ సెంచరీతో(115*) కదంతొక్కాడు. రూట్ సెంచరీతో ఇంగ్లండ్ జట్టు తొలి టెస్టులో న్యూజిలాండ్ పై విజయం నమోదు చేసింది. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. 277 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన ఇంగ్లండ్ ఓ దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా,…
టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ అప్పట్లో శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన సంఘటన గుర్తుందా? ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో సీనియర్స్ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడన్న నెపంతో.. కోపాద్రిక్తుడైన హర్భజన్ లాగి ఒక్కటిచ్చాడు. ఆరోజుల్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనకు ‘స్లాప్ గేట్’ అనే ముద్ర కూడా పడింది. అప్పట్లో ఈ ఉదంతంపై హర్భజన్ పెద్దగా నోరు విప్పింది లేదు. అయితే, ఇన్నాళ్ల తర్వాత ఆ ఘటనని గుర్తు చేసుకుంటూ ‘తాను చేసింది ముమ్మాటికీ తప్పే’నని…
భారత్ లో క్రికెట్ ఒక మతం అయితే అతడు దేవుడు. అతని పేరు వింటే చాలు దిగ్గజ బౌలర్లకు కూడా నిద్ర పట్టని సందర్భాలు చాలానే ఉన్నాయి. అతడుబ్యాటింగ్ కి వచ్చాడంటే సెంచరీ ఖాయం అని అనుకొనే ఫామ్ అతడిది. అతడు సరిగ్గా బ్యాటింగ్ చేస్తే భారత్ విజయం సాధించినట్టే అని అనుకొనే ఆట అతని సొంతం. అతను అవుట్ అయితే చాలు TV లు ఆఫ్ చేసి, మ్యాచ్ ఓడినట్టే అని అనుకునేవాళ్లం . అతను…
ఒకప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ, మాజీ ఓపెనర్ విరేందర్ సెహ్వాగ్‌ల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉండేవని తెగ ప్రచారాలు జరిగాయి. ముఖ్యంగా.. 2008లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తుది జట్టు నుంచి సెహ్వాగ్‌ను ధోనీ తొలగించినప్పుడు, ఆ ప్రచారాలు మరింత బలపడ్డాయి. కానీ.. అవన్నీ అవాస్తవాలేనని ఆ తర్వాత నిరూపితమైంది. అయితే, అప్పట్లో జరిగిన ఓ పరిణామం గురించి మాత్రం తాజాగా సెహ్వాగ్ పంచుకున్నాడు. ధోనీ తనని అలా జట్టు నుంచి తొలగించినప్పుడు తాను…
ఐపీఎల్ 15 వ సీజన్ టైటిల్ ని గుజరాత్ టైటాన్స్ గెలుచుకుంది. ఈ జట్టు అరంగేట్రం చేసిన తొలి సీజన్ లోనే కప్ ని సొంతం చేసుకోవడం విశేషం. మెగా వేలం తరువాత ఈ జట్టు పట్ల చాలామంది విమర్శలు చేసారు. అయితే ఆ విమర్శలకు గట్టిగా జవాబిస్తూ టైటిల్ ని గెలుచుకుంది గుజరాత్ జట్టు. ఐపీఎల్ 15వ సీజన్‌లో చాలా మంది యువ ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. కోహ్లీ,రోహిత్,పంత్, ధోని లాంటి సీనియర్ ఆటగాళ్లు…
నిన్న (మే10) లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ సాధించిన విజయంలో శుబ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఇతర బ్యాట్స్‌మెన్స్ అంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. ఇతనొక్కడే 49 బంతుల్లో 7 ఫోర్లతో 69 పరుగులు చేసి, చివరివరకూ అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే సుధీర్ఘకాలం నుంచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ను అతడు అందుకున్నాడు. 2009లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్…
2007లో టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత కెప్టెన్‌గా ఎంతో మంది సీనియర్లను కాదని బీసీసీఐ ధోనీని నియమించింది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌కు సీనియర్లు దూరంగా ఉండటంతో యువరాజ్‌కు కెప్టెన్సీ ఇస్తారని అందరూ భావించారు. అయితే బీసీసీఐ అనూహ్యంగా ధోనీకి పగ్గాలు ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. 2007లో తాను కెప్టెన్ కావాల్సిందని.. కానీ అప్పుడు గ్రెగ్ ఛాపెల్ ఘటన జరిగిందని.. అది…
2011లో సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 2) కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచ విజేతగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. తమ సీనియర్ ఆటగాడు సచిన్‌కు అందమైన బహుమతిని అందజేసింది. భారత్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో భారీ అంచనాల నడుమ టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో తమ…
క్రికెట్ దిగ్గజం, భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ టెండుల్కర్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకున్నారు. ముంబై పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. శుక్రవారం ఉదయం రాజ్ భవన్లో సచిన్‌తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనే అని తెలుస్తోంది. కాగా రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగియనుంది.…