Kapil Dev: సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప?..కపిల్ దేవ్ దిమ్మతిరిగే కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అయితే గత మూడేళ్లలో ఒక్క సెంచరీ చేయలేకపోయిన కోహ్లీ గతేడాది ఆసియా కప్‌లో సెంచరీ తర్వాత మళ్లీ గాడిలో పడ్డాడు. ఆ తర్వాత మళ్లీ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో టీ20ల్లో తొలి సెంచరీ చేసిన విరాట్.. తర్వాత టెస్టులు, వన్డేల్లోనూ మూడంకెల స్కోరు అందుకున్నాడు. అలాగే వన్డేల్లో సచిన్ పేరుమీదున్న రికార్డు సెంచరీల వైపు వేగంగా దూసుకెళ్తున్నాడు. సచిన్ 49 సెంచరీలు చేయగా.. విరాట్ ప్రస్తుతం 46 శతకాలతో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి సచిన్, కోహ్లీలలో ఎవరు గొప్ప అన్న చర్చ మళ్లీ మొదలైంది. దీనిపై ఎవరి అభిప్రాయం వారిది. తాజాగా కపిల్ దేవ్ కూడా దీనిపై స్పందించాడు.
Viral Video: ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో తాతయ్య రచ్చ.. మంచి రొమాంటిక్ డైరెక్టర్ అయ్యేవాడేమో..!
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
“జనరేషన్ మారినా కొద్దీ ఒకరి కంటే మెరుగైన ప్లేయర్ మరొకరు వస్తూనే ఉంటారు. అందువల్ల వారి మధ్య పోలిక పెట్టడం అనవసరం. క్రికెట్ అనేది 11 మంది ప్లేయర్స్‌తో కూడిన టీమ్. నాకు నా ఇష్టాయిష్టాలు ఉంటాయి. కానీ ప్రతి తరం మరింత మెరుగైన ఆటగాడిని అందిస్తుంది. మా టైమ్ లో సునీల్ గవాస్కర్ అత్యుత్తమ బ్యాటర్. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, సచిన్, సెహ్వాగ్ లాంటి వాళ్లు వచ్చారు. ఈ తరంలో రోహిత్, విరాట్ ఉన్నారు. వచ్చే తరంలో మరింత మెరుగైన ప్లేయర్స్ వస్తారు. మనం మరింత మెరుగైన క్రికెటర్‌ను, మరింత మెరుగ్గా ఆడటం చూస్తాం” అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ వెల్లడించాడు.
Mahakaleswar Temple: రిషబ్ పంత్ కోసం.. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో క్రికెటర్ల పూజలు
సచిన్‌తో పోలిక విషయంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. వన్డే ప్రపంచకప్‌కు ముందు కోహ్లీ మళ్లీ మునుపటి ఫామ్ లోకి రావడం మాత్రం ఫ్యాన్స్‌ను ఆనందానికి గురి చేస్తోంది. గత ఆరు వన్డేల్లో విరాట్ మూడు సెంచరీలు చేయడం విశేషం. ఈ ఏడాది చివర్లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో విరాట్ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!