JaiShankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రే ప్రాంతంలోని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదం చెలరేగింది. పలు సందర్భాల్లో కెనడా, భారత దేశాన్ని కావాలనే కవ్విస్తోంది. ఇటీవల కూడా భారత్ లో కెనడా ప్రజలు భద్రంగా లేరని చెబుతూ వారికి ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.…
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కి కేంద్రం భద్రతను పెంచింది. ఇప్పటి వరకు ఉన్న వై కేటగిరి భద్రతను పెంచుతూ ‘జెడ్ కేటగిరి’గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
S Jaishankar: భారత్-అమెరికా కలిసి పనిచేయడం చాలా అవసరమని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇరు దేశాల బంధంపై పరిమితి విధించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు దేశాలు ఒకరికొకరు కావాల్సిన, అనుకూలమైన, సౌకర్యవంతమైన భాగస్వాములుగా ఆయన అభివర్ణించారు. ఇటీవల యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు జైశంకర్ అమెరికా వెళ్లారు. దీంతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, యూఎస్ జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమయ్యారు.
Jaishankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా మధ్య తీవ్ర వివాదానికి దారి తీశాయి. కెనడా ప్రధాని మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ప్రేమయం ఉందని ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యలకు భారత్ కూడా గట్టిగానే స్పందిస్తోంది.
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి నేతలతో సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్యవివాదం చెలరేగుతున్న సమయంలో జైశంకర్ యూఎస్ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రసంస్థ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసింది.
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెస్ట్రన్ మీడియాకు మరోసారి తనదైన శైలిలో చురకలు అంటించారు. గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ని ఇరుకున పెట్టేందుకు వెస్ట్రన్ మీడియా తీవ్రంగా ప్రయత్నించి అభాసుపాలైంది. తాజాగా కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హార్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై ఎస్ జైశంకర్ ని మీడియా ప్రశ్నించింది. దీనిపై వారికి మరోసారి దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చారు.
S Jaishankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య అగ్గిరాజేసిన వేళ భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పరోక్షంగా కెనడాకు గడ్డి పెట్టారు. ఆ దేశాన్ని ఉద్దేశించేలా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సౌలభ్యం కోసం ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసపై ప్రతిస్పందన ఉండకూడదని ఆయన అన్నారు.
India vs Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యవెనక భారత్ ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడా సీనియర్ దౌత్యవేత్తను 5 రోజుల్లో భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలని భారత్ ఖండించింది.
India: ఖలిస్తానీ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. కెనడా చేస్తున్న ఆరోపణలు అసబద్ధమైనవి, ప్రేరేమితమని భారత విదేశాంగ శాఖ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. భారతదేశానికి చట్టబద్దమైన పాలనపై బలమైన నిబద్ధత ఉందని పేర్కొంది. ‘‘కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో, వారి విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను చూశామని, కెనడాలోని ఏదైన హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనే ఆరోపణలు పూర్తిగా…
మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ మహిళ సయ్యదా లులు మిన్హాజ్ జైదీ చికాగో రోడ్లపై మానసిక ఒత్తిడితో పోరాడుతూ, తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తున్నారు.