S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెస్ట్రన్ మీడియాకు మరోసారి తనదైన శైలిలో చురకలు అంటించారు. గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ని ఇరుకున పెట్టేందుకు వెస్ట్రన్ మీడియా తీవ్రంగా ప్రయత్నించి అభాసుపాలైంది. తాజాగా కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హార్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై ఎస్ జైశంకర్ ని మీడియా ప్రశ్నించింది. దీనిపై వారికి మరోసారి దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చారు.
న్యూయార్క్ లో జరిగిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ ఈవెంట్ లో విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ పాల్గొన్నారు. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య గురించి అక్కడి మీడియా ప్రశ్నించింది. హత్యకు సంబంధించిన సమాచారాన్ని ‘ఐవ్ ఐస్’ దేశాలు, ఎఫ్‌బీఐ పంచుకుందని వారి దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందని చెబుతున్నారని జైశంకర్‌ని మీడియా అడిగింది. ‘‘నేను ఫైవ్ ఐస్ దేశాల్లో భాగం కాదని, ఎఫ్‌బీఐలో సభ్యున్ని కదాని, మీరు తప్పుగా ఈ ప్రశ్నను నన్ను అడుగుతున్నారు’’ అని ఆయన అన్నారు.
Read Also: Hardeep Singh Nijjar: ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ.. కారణం ఇదే..
ఐవ్ ఐస్ దేశాల కూటమిలో అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ఉన్నాయి. ఇంటలిజెన్స్, సర్వెలెన్స్ సమాచారాన్ని ఈ దేశాలు ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాయి. కెనడా నిర్ధిష్టమైన సమాచారాన్ని మాకు ఇస్తే చూడటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కెనడాకు తెలియజేసినట్లు జైశంకర్ వెల్లడించారు. నిజ్జర్ హత్యపై మాట్లాడుతూ.. ఇది భారత్ విధానం కాదని స్పష్టం చేశారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ నెలలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే నగరంలో గురుద్వారా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. తమ దగ్గర నమ్మదగిన ఆరోపణలు ఉన్నాయంటూ పేర్కొంది. మరోవైపు అమెరికా ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంపై ఆధారపడి కెనడా ప్రధాని భారత్ పై నిందలు వేశారని యూఎస్ మీడియాలో కథనాలు వచ్చాయి.