దాదాపు 47 ఏళ్ల తర్వాత రష్యా చేపట్టిన మొట్టమొదటి మూన్ మిషన్ లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయింది. ల్యాండింగ్‌కు ముందు విన్యాసాల సమయంలో చంద్రునిపై అంతరిక్ష నౌక కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ఆదివారం తెలిపింది.
47 సంవత్సరాలలో తన మొట్టమొదటి చంద్ర ల్యాండింగ్ వ్యోమనౌకను ప్రయోగించడానికి రష్యా తన తుది సన్నాహాలు చేసింది. చంద్రుని దక్షిణ ధృవం మీద గణనీయమైన నీటి మంచు నిక్షేపాల ఉనికిని కనుగొనడానికి రష్యా 25 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే.