Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు టూరిస్టులపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. పర్యాటకుల్ని టార్గెట్ చేస్తూ మంగళవారం దాడికి పాల్పడ్డారు.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో మంగవారం ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు. ఉగ్రవాదులు టూరిస్టుల్ని చుట్టుముట్టి కాల్చి చంపారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేశారు.
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కీలక సూత్రధారులు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్ ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోరెన్సిక్, నిఘా, భద్రతా సంస్థల సంయుక్త దర్యాప్తులో ఆపరేషన్‌కి సంబంధించిన పాక్ ప్రమేయాన్ని సూచిస్తున్నాయి.
Pahalgam attack: పహల్గామ్ దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి కొన్ని రోజులు ముందే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాశ్మీర్ తమ జీవనాడి అని, కాశ్మీర్ కోసం పోరాడుతున్నవారికి సాయం చేస్తామని చెప్పారు. పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు ఉంటుందని చెప్పారు.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయం సుస్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం కాశ్మీర్ అందాలను చూసేందుకు పహల్గామ్ బైసరీన్ గడ్డి మైదానాలు చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేశారు. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ బాధ్యత ప్రకటించింది.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకుల్ని ఇస్లామిక్ టెర్రరిస్టులు దారుణంగా చంపేశారు. మతం, పేరు అడుగుతూ మరీ హిందువుల్ని టార్గెట్ చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని శోకానికి గురి చేసింది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన టూరిస్టులపై ముష్కరులు కాల్పులు జరిపారు. పహల్గామ్లోని బైసరీన్ గడ్డి మైదానాల వద్ద ఈ ఘటన జరిగింది. ఆ దుశ్చర్యలో 27 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ విషాద సమయంలో భారత్‌కి అండగా నిలుస్తామని చెబుతున్నాయి. Read Also: Danish Kaneria: ‘‘హిందువులే టార్గెట్’’..…
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఈస్టర్ సందర్భంగా కాల్పులకు విరామం ప్రకటించి సంచలనం సృష్టించారు. తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Putin: ఉక్రెయిన్‌లో ఏకపక్షంగా ఈస్టర్ కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది. ఆదివారం వరకు శత్రుత్వాన్ని ముగించాలని రష్యన్ బలగాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. శనివారం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఈస్టర్ సంధిని పుతిన్ ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా వేదికగా పలుమార్లు రష్యా-అమెరికా అధికారుల మధ్య చర్చలు జరిగాయి.