Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధినేత పుతిన్ గురించి సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న వేళ జెలెన్స్కీ ప్రకటన సంచలనంగా మారింది. ‘‘త్వరలోనే పుతిన్ చనిపోతారు’’ అని, ఇది రెండు దేశాల మధ్య యుద్ధం ముగింపుకు సాయపడుతుందని అన్నారు. పారిస్‌లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ పుతిన్ ఆరోగ్యం పరిస్థితులపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అతను(పుతిన్) త్వరలోనే చనిపోతారు. ఇది…
Putin: గతేడాది ఫిబ్రవరి తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సొంత దేశం వదిలి వేరే దేశ పర్యటనకు వెళ్లారు. యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ
అంతర్జాతీయ రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. నార్డిక్ దేశమైన ఫిన్లాండ్ తీరుపై రష్యా మండిపడుతోంది. ఫిన్లాండ్ త్వరలో నాటో కూటమిలో చేరేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు సౌలి నిన్నిస్టో, ప్రధాని సన్నామారిన్‌లు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేయడం కలకలం రేపుతోంది. వెంటనే నాటోలో చేరేందుకు దరఖాస్తు చేయడానికి సిద్ధం కావాలని వారిద్దరూ పిలుపునిచ్చారు. రానున్న మరికొన్నిరోజుల్లో నిర్ణయం వెలువడుతుందని వెల్లడించారు. నాటో సభ్యత్వంతో ఫిన్లాండ్ భద్రత మరింత బలపడుతుందని…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ టూర్‌లో వున్నారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… జర్మనీకి చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన ఆయన.. సోమవారం ఉదయం 9.42 గంటలకు జర్మనీలో దిగారు. ఆ దేశ ఉన్నతాధికారులు మోదీకి ఘనస్వాగతం పలికారు. జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్‌తో మోదీ భేటీ కానున్నారు. ఈ పర్యటనలో పలు ద్వైపాక్షిక అంశాలపై మోడీ చర్చించనున్నారు. ఉక్రెయిన్ – రష్యా మధ్య…
Telangana CM K Chandra Shekar Rao Wrote Letter to Prime Minister Narendra Modi. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ మరోసారి లేఖ రాశారు. ఇటీవల తెలంగాణలో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇండియాకు ఎంతో మంది వైద్య విద్యార్థుల కోసం లేఖ రాశారు. ఈ లేఖలో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన వైద్య…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. భీకర దాడులు 10వ రోజుకు చేరుకున్నాయి.. అయితే, సుమారు ఐదు గంటలపాటు తాత్కాలికంగా విరమించుకున్న రష్యా.. మళ్లీ కాల్పులతో విరుచుకుపడుతోంది.. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల నుంచి అయిదున్నర గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా.. ఆ తర్వాత మళ్లీ యుద్ధం మొదలైంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు కొనసాగిస్తోంది.. ఉక్రెయిన్‌లోని పోర్టు సిటీ మారియుపోల్, వోల్నావోఖా నగరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి…
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభానికి కారణం అవుతున్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి చర్చలు జరపాలని ఇరుదేశాలను ప్రపంచం కోరుతోంది. దీంతో ఈ వారాంతంలో మరోసారి రష్యాతో శాంతి చర్చలు జరపాలనే ఆలోచనలో వుంది ఉక్రెయిన్. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 331 మంది పౌరులు మృతి చెందగా 685 మందికి గాయాలయ్యాయి. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చంటున్నారు. ఖేర్సన్ కు దక్షిణ ప్రాంతాలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఓజోవ్ సముద్ర…