భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ టూర్‌లో వున్నారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… జర్మనీకి చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన ఆయన.. సోమవారం ఉదయం 9.42 గంటలకు జర్మనీలో దిగారు. ఆ దేశ ఉన్నతాధికారులు మోదీకి ఘనస్వాగతం పలికారు. జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్తో మోదీ భేటీ కానున్నారు. ఈ పర్యటనలో పలు ద్వైపాక్షిక అంశాలపై మోడీ చర్చించనున్నారు. ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ మోడీ యూరప్ టూర్ అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) ఆరో సమావేశానికి ఇరువురు దేశాధినేతలు అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. అనంతరం ఉన్నతస్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో మోదీ, షోల్జ్ పాల్గొంటారు.
Landed in Berlin. Today, I will be holding talks with Chancellor @OlafScholz, interacting with business leaders and addressing a community programme. I am confident this visit will boost the friendship between India and Germany. pic.twitter.com/qTNgl8QL7K
— Narendra Modi (@narendramodi) May 2, 2022
తనకు స్వాగతం పలకడానికి వచ్చిన ఎన్నారై కుటుంబాలతో మోడీ ఆత్మీయంగా మాట్లాడారు. తన పర్యటనలో భాగంగా రెండు దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలతో మోడీ మాట్లాడనున్నారు. రాత్రి 10 గంటలకు భారత సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ప్రధాని మెటె ఫెడరిక్సన్ ఆహ్వానం మేరకు మోడీ మంగళవారం కోపెన్‌హేగెన్ వెళతారు. రెండో భారత్-నార్డిక్ సదస్సులో డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే దేశాధినేతలతో భేటీ అవుతారు. డెన్మార్క్ నుంచి భారత్ తిరిగి వస్తూ పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ని ప్రధాని కలవనున్నారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి విజయం సాధించినందుకు మెక్రాన్‌ను అభినందించనున్నారు మోడీ.ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ నేతలు, 50 మంది అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారు మోడీ. యూరప్ పర్యటనలో 25 సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.
Tirumala: తిరుమలలో కలకలం.. ఐదేళ్ల బాలుడి కిడ్నాప్