ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి వేగంగా తరలించేందుకు ముమ్మర సన్నాహాలు చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ గంగాలో భాగంగా ప్రత్యేక విమానాలు నడుపుతోంది. వచ్చే మూడు రోజులలో మొత్తం 26 విమానాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల లక్షలాదిమంది నిరాశ్రయులవుతున్నారు. వేలాదిమంది మరణిస్తున్నారు. వేలాదిమంది భారతీయ విద్యార్ధులు రష్యా సరిహద్దుల్లో చిక్కుకుని పోయారు. తూర్పు ఉక్రేయిన్ లోని “సుమీ” పట్టణంలో చిక్కుకుపోయారు 500 మంది భారతీయ విద్యార్థులు. రష్యా సరిహద్దులకు కేవలం రెండు గంటల్లో చేరుకునే దూరంలో ఉంది సుమీ పట్టణం. వెనువెంటనే తమను రష్యా గుండా స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు విద్యార్థులు. ఉక్రెయిన్ పశ్చిమ వైపునకు వెళ్లడానికి 20 గంటల ప్రయాణం చేయాల్సి ఉంది. ప్రస్తుత…
ఒక్క యుద్ధం.. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. గతంలో జరిగిన అనేక యుద్ధాలు ఇదే సంగతి చెప్పాయి. తాజాగా ఉక్రెయిన్ వార్..మన పొరుగుదేశం శ్రీలంకను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది.ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకను.. చమురు ధరల పెరుగుదల నిలువునా ముంచేసింది. లీటర్ పెట్రోల్ ధర రెండు వందలు దాటింది. నిత్యవసరాల ధరలు … మరింత పెరగడంతో, సామ్యాన్యుడి బతుకు.. దినదినగండంలా మారింది.రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తాయనే…