Ukraine Crisis: ఉక్రెయిన్ స్వాధీనంలోకి జపరోజియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభానికి కారణం అవుతున్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి చర్చలు జరపాలని ఇరుదేశాలను ప్రపంచం కోరుతోంది. దీంతో ఈ వారాంతంలో మరోసారి రష్యాతో శాంతి చర్చలు జరపాలనే ఆలోచనలో వుంది ఉక్రెయిన్. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 331 మంది పౌరులు మృతి చెందగా 685 మందికి గాయాలయ్యాయి. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చంటున్నారు.
ఖేర్సన్ కు దక్షిణ ప్రాంతాలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఓజోవ్ సముద్ర తీరంలోని మరియు పోల్ ఓడరేవు నగరాన్ని దిగ్బంధం చేశాయి రష్యా సేనలు. విద్యుత్, తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో అంధకారంగా మారింది మరియుపోల్ ఓడరేవు నగరం. 4 లక్షల 50 వేల మంది జనాభా ఉన్న మరియుపోల్ ఓడరేవు నగరాన్ని బాంబు దాడులతో ధ్వంసం చేసింది రష్యా. యూరోప్ లో అత్యంత భారీ అణు విద్యుదుత్పత్తి కేంద్రమైన “జపరోజియా” ను స్వాధీనం చేసుకున్న తర్వాత, అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మరో అతి పెద్ద అణు విద్యుదుత్పత్తి కేంద్రానికి సమీపంలోకి చేరాయి. అయితే జపరోజియా” అణు విద్యుదుత్పత్తి కేంద్రం పై రష్యా దాడిని “యుధ్ద నేరం” గా అభివర్ణించింది ఉక్రెయిన్ లోని అమెరికా రాయబార కార్యాలయం. రష్యా అధీనంలో ఉన్న అత్యంత భారీ అణు విద్యుదుత్పత్తి కేంద్రమైన జపరోజియాను తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకున్నామని ఉక్రెయిన్ ప్రకటించింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుధ్దాన్ని ఉధృతి చేసింది రష్యా. 500 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది రష్యా. రష్యా రోజుకు రెండు డజన్ల చొప్పున అన్ని రకాల క్షిపణులను ప్రయోగిస్తోందని అమెరికా పెంటగాన్ అధికారి వెల్లడించారు. రాజధాని “కీవ్” నగరంలో మరిన్ని వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!