ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. భీకర దాడులు 10వ రోజుకు చేరుకున్నాయి.. అయితే, సుమారు ఐదు గంటలపాటు తాత్కాలికంగా విరమించుకున్న రష్యా.. మళ్లీ కాల్పులతో విరుచుకుపడుతోంది.. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల నుంచి అయిదున్నర గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా.. ఆ తర్వాత మళ్లీ యుద్ధం మొదలైంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు కొనసాగిస్తోంది.. ఉక్రెయిన్‌లోని పోర్టు సిటీ మారియుపోల్, వోల్నావోఖా నగరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి రష్యా బలగాలు.. ఉక్రెయిన్‌లో పర్యాటక ప్రాంతమైన మారియుపోల్‌ను స్వాధీనం చేసుకునేదిశంగా ముందుకు సాగుతోంది రష్యా..
Read Also: KTR: ఏ చర్చకైనా సిద్ధం.. కేటీఆర్ సవాల్
ఇక, మారియుపోల్‌కు బలగాలు, ఆహారం, విద్యుత్, నీరు వంటి సదుపాయలను అడ్డుకుంటున్నాయి రష్యన్ బలగాలు.. ఈ పరిస్థితిలో ఆహారం, వాటర్, మందుల సరఫరాను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు మారియుపోల్ నగర మేయర్ వాదిమ్ బాయ్‌చెన్‌కో… ఈ విషయంలో రష్యా మానవత దృక్పథంలో వ్యవహరించాలని కోరారు.. ఇక, పౌరులు మారియుపోల్ మరియు వోల్నోవాఖాలను విడిచిపెట్టడానికి అనుమతించబోమని రష్యా స్పష్టం చేసింది.. అయితే, మరణించిన పౌరుల సంఖ్య ఇంకా అస్పష్టంగా ఉంది, అయితే, ఫిబ్రవరి 24 నుండి ఉక్రెయిన్ నుండి మిలియన్ల మంది వలసవెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది..