PM Modi can bring peace between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కాసౌబోన్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా,ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
Russian Youth leave nation due to new war plans: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మరింతగా ముదిరే పరిస్థితి కనిపిస్తోంది. పాక్షిక సైనిక సమీకరణకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్ వైపు మరింత మంది సైనికులను తరలించనున్నట్లు తెలుస్తోంది. తమ భూభాగాలను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామని.. అణుబాంబు వేసే సమయం వచ్చిందని..దీన్ని అమెరికా, దాని మిత్ర రాజ్యాలు డ్రామాలు…
France and USA praised Prime Minister Modi's comments: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడితో అన్న వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. తాజాగా యూఎస్ఏ, ఫ్రాన్స్ దేశాలు కూడా మోదీ వ్యాఖ్యలు సరైనవని తెలిపాయి. న్యూయార్క్ లో జరుగుతన్న 77వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మద్దతు తెలిపారు. యుద్ధానికి ఇది సమయం కాదని ప్రధాని మోదీ…
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగ బయటపడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ నుంచి రష్యా బలగాలు నిష్క్రమించాయి. ఈ ప్రాంతాన్ని మళ్లీ ఉక్రెయిన్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తిరిగి ఆధీనంలోకి తీసుకున్న ప్రాంతాల్లో రష్యా బలగాలు చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇజియమ్ ప్రాంతంలో 400లకు పైగా మృతదేహాలను ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు. దీంట్లో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
US Media Praises PM Modi: ఉజ్బెకిస్తన్ లో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షింది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై భారత ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో అని అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఆసక్తిగా చూశాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధినేత పుతిన్, భారత ప్రధాని మోదీలు తొలిసారిగా ఒకే వేదికను పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, ఉక్రెయిన్ యుద్ధంపై…
Supreme Court Seeks Portal To Assist Ukraine Returned medical Students: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న దాదాపుగా 20 వేల మంది భారతదేశానికి తిరిగివచ్చారు. అయితే తాము తమ విద్యను భారత్ తో కొనసాగించే విధంగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం రోజున న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన…
World could face recession next year - World Bank report: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆర్థిక మందగమనం కనిపిస్తోంది. చాలా దేశాల ఆర్థిక పరిస్థితి చాలా వరకు క్షీణిస్తోంది. ఇప్పటికే శ్రీలంక దివాళా తీయగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాల్లో కూడా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్న కేంద్ర బ్యాంకులు తమ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్నాయి.. దీంతో వచ్చే ఏడాది ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని…
PM Modi holds bilateral talks with Russian President Putin: ఉజ్జెకిస్తాన్ లో జరుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) సమావేశంలో పాల్గొనేందుకు సమర్ కండ్ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. రష్యా, ఉక్రెయిన్ ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తో తొలిసారిగా సమావేశం అయ్యారు. ఇరు దేశాల కూడా ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధాల యుగం…
Central Government File Affidavit on Ukraine Returnee Medical Students: ఉక్రెయిన్ విద్యార్థులకు నిరాశే ఎదురైంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు చేరుకున్న విద్యార్థుల కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు ఇండియాలోని వైద్య కళాశాల్లో అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందడం చట్టపరంగా…
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రమాదానికి గురయ్యారని, అయితే ఆయన క్షేమంగా ఉన్నారని ఆయన ప్రతినిధి తెలిపారు.