Home
Russia Ukraine War 2
Russia Ukraine War 2 News
-
China: రష్యా, ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోం.. చైనా కీలక ప్రకటన
ఉక్రెయిన్ యుద్ధంలో ఏ దేశానికి ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రతిజ్ఞ చేసింది. యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని ప్రకటించింది. బీజింగ్ రష్యాకు సైనిక సహాయం అందించగలదనే పాశ్చాత్య ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ శుక్రవారం చెప్పారు. -
Russian Missile Strike: ఉక్రెయిన్‌లోని స్లోవియన్స్క్‌పై రష్యా క్షిపణి దాడి.. 8 మంది మృతి
తూర్పు ఉక్రెయిన్ నగరమైన స్లోవియన్స్క్లోని నివాస ప్రాంతంపై శుక్రవారం రష్యా క్షిపణి దాడి చేసినట్లు అల్ జజీరా నివేదించింది. ఈ దాడిలో 8 మంది మరణించినట్లు తెలిపింది. రష్యాకు చెందిన ఏడు ఎస్-300 క్షిపణులు బఖ్ముట్ నగరానికి పశ్చిమాన ఉన్న స్లోవియన్స్క్‌పై దాడి చేశాయి. -
Ukraine War: వీకిపీడియాకు మాస్కో కోర్టు షాక్.. ఉక్రెయిన్ యుద్ధంపై కథనం రాసినందుకు జరిమానా
ఉక్రెయిన్ యుద్ధంపై కథనం రాసినందుకు రష్యన్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందన్న అభియోగాలను మాస్కో కోర్టు ధృవీకరించింది. ఈ క్రమంలో వీకిపీడియా యజమానికి 2 మిలియన్ల రూబుల్స్ ($24,464) జరిమానా విధించింది. ఉచిత, పబ్లిక్‌గా-ఎడిట్ చేయబడిన ఆన్లైన్ ఎన్సైక్లోపీడియాను నిర్వహిస్తున్న లాభాపేక్షలేని సంస్థ వికీమీడియా ఫౌండేషన్‌కు న్యాయస్థానం ఈ జరిమానాను విధించింది. -
Vladimir Putin: ఆందోళనకరంగా పుతిన్ ఆరోగ్యం.. అస్పష్టమైన చూపు, తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న అధ్యక్షుడు..
Vladimir Putin: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతన్ ఆరోగ్యంపై వదంతులు వస్తూనే ఉన్నాయి. పుతిన్ ఆరోగ్యం చాలా క్షీణించందని, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, క్యాన్సర్ తో ఇబ్బందిపడుతున్నారని పలు వార్తలు వచ్చాయి. తాజాగా వచ్చిన ఓ నివేదిక పుతిన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలిపింది. అతడి ఆరోగ్యంపై వైద్యులు భయాందోళనలో ఉన్నట్లు తెలిపింది. -
Russia-Ukraine War: గుట్టుచప్పుడు కాకుండా రష్యాకు ఈజిప్టు ఆయుధాలు..
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ ద్వారా లీక్ అయిన యూఎస్ ఇంటెలిజెన్స్ పత్రాల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు మిత్రదేశంగా ఉన్న ఈజిప్టు, రష్యాకు సాయం చేసేందుకు సిద్ధం అయినట్లు పత్రాల ద్వారా వెల్లడైంది. ఈజిప్టు రహస్యంగా దాదాపుగా 40,000 రాకెట్లను ఉత్పత్తి చేసి రష్యాకు సరఫరా చేయాలని ప్లాన్ వేసింది. -
Donald Trump: 24 గంటలు చాలు..రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపేస్తా..
Donald Trump: వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలని అనుకుంటున్నారు. ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఆయన అమెరికాలో ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే మరోసారి ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని తాను 24 గంటల్లో పరిష్కరించగలనని తెలిపాడు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు అధ్యక్షత వహించడం… -
Russia: భారత్‌కు చమురు అమ్మకాలు 20 రెట్లు పెరిగాయి.. రష్యా ఉప ప్రధాని ప్రకటన
Russia Says Oil Sales To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసి, రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీద్దాం అనుకున్న అమెరికా, యూరోపియన్ దేశాలకు ప్లాన్ బెడిసికొట్టింది. భారత్, చైనా రూపంలో బలమైన మార్కెట్లను రష్యా ఆదాయంగా మలుచుకుంది. ఈ రెండు దేశాలకు కావాల్సిన చమురును అత్యంత చౌకగా రష్యా అందిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రష్యా నుంచి భారత్ కు క్రూడ్ ఆయిల్ దిగుమతులు పెరిగాయి. -
Russia: పుతిన్‌ను విమర్శించిన పాప్‌స్టార్ మృతి
Russia: రష్యా-ఉక్రెయిన్ యద్ధాన్ని విమర్శించి పాప్ స్టార్ డిమానోవా(35) ఓ నది ప్రమాదంలో మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఆయన అసలు పేరు డిమిత్రి స్వర్గునోవ్. ఆయన ప్రముఖ సంస్థ క్రీమ్ సోడా వ్యవస్థాపకుడు. డీమానోవా తన సోదరుడు ముగ్గరు స్నేహితులతో కలిసి మార్చి 19న గడ్డకట్టిన వోల్గా నది దాటుతుండగా మంచులో పడిపోయి మరణించారు. అతడి ఇద్దరు స్నేహితులను రక్షించగా.. మూడో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. -
Russian Drone Attack: కీవ్‌లోని ఓ పాఠశాలపై రష్యా డ్రోన్ దాడి.. ముగ్గురు దుర్మరణం
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఓ ఉన్నత పాఠశాలపై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కీవ్‌లోని స్కూల్‌పై రష్యా రాత్రిపూట ఈ దాడి చేపట్టినట్లు అధికారులు తెలిపారు. -
Russia: ఐఫోన్లు పడేయండి లేదా మీ పిల్లలకు ఇవ్వండి.. అధికారులకు అధ్యక్ష భవనం ఆదేశాలు..
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు ఐఫోన్లు వాడొద్దనే ఆదేశాలు అధికారులకు వెళ్లాయి. అధ్యక్ష భవనం క్రెమ్లిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అమెరికా తయారీ ఐఫోన్ కావడంతో పాశ్చాత్య దేశాలు నిఘా పెంచే అవకాశం ఉండటంతో క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తవి కొనొద్దని, ఉన్నవాటిని పక్కన పారేయాలని అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!