Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లోకి ఉత్తర కొరియా సైనికులు ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా తరుపున పోరాడటానికి కిమ్ సైన్యాన్ని పుతిన్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. తమపై పోరాటంలో 10,000 మంది ఉత్తర కొరియా సైనికులను మోహరించడానికి రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ గురువారం చెప్పారు. ఉత్తర కొరియా రష్యాకి తన సైనికులను పంపిందని జెలన్ స్కీ గతంలో కూడా ఆరోపించారు. అయితే, మొదటిసారి ఎంత మంది సైనికులను పంపించారనే విషయంపై…