రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్ లోని నగరాలు అట్టుడుకుతున్నాయి. యుద్ధం ఇవాళ్టికి 17వ రోజుకు చేరుకుంది. రష్యా మాత్రం తన పట్టువీడడం లేదు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. బాంబుదాడులతో పలు నగరాలకు పూర్తిగా ధ్వంసమై శ్మశానాలను తలపిస్తున్నాయి. లక్షలాదిమంది ప్రజలు ఉక్రెయిన్‌ను విడిచి వలస పోతున్నారు. 10 లక్షలమంది వరకూ వలస వెళ్ళి వుంటారని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ లోని అనేక నగరాలు రష్యా సైన్యం అధీనంలోకి వెళ్లినట్టు…