ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు తమ పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయని నరేంద్ర మోడీ వెల్లడించారు. సమాజ సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాటిస్తున్న విధానాలే గ్రామీణ భారతంలో కొత్త శక్తిని నింపుతున్నాయని చెప్పుకొచ్చారు.
Loan App Harassment: ప్రైవేట్ యాప్‌లో తీసుకున్న రుణం తీర్చలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం, మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (28) అనే వ్యక్తి మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గంగాధర్ గతంలో ఆన్‌లైన్ ద్వారా రూ. 1.20 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ…
CAG on Viksit Bharat: భారతదేశంలోని గ్రామాలు అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవడం అసాధ్యం అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గిరీశ్ చంద్ర ముర్ము తెలిపారు.
ASER report: గ్రామీణ భారతదేశంలో విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగా ఉన్నట్లు ASER 2023 'బియాండ్ బేసిక్స్' సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో 14-18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు సులభమైన సాధారణ ఇంగ్లీష్ వ్యాఖ్యలను కూడా చదవలేకపోతున్నారని తేలింది. దీంతో పాటు లెక్కలు చేయడంలో కూడా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వార్షిక విద్యా స్థితి నివేదిక ప్రకారం ( ASER) 2023 బుధవారం వెల్లడించింది. ప్రభుత్వాలు తన విధానాలను రూపొందించేందుకు ASER నివేదికలను ఉపయోగించుకుంటాయి.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయింది. డిజిటలైజేషన్ వినియోగంలోకి రావడంతో నగరాలు, పట్టణాల్లో స్మార్ట్ ఫోన్లను అధికంగా వినియోగిస్తున్నారు. ఒకప్పుడు కేవలం నగరాలకు మాత్రమే పరిమితమైన మొబైల్ ఫోన్లు ఇప్పుడు పట్టణాలు, గ్రామాలకు విస్తరించాయి. గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచంలో తయారైన కొత్తకొత్త మోడళ్లు దేశానికి దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్ ఫోన్లు చాలా తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో వినియోగం పెరిగిపోయింది. Read: Revanth Reddy : కోట్లాడిన వాళ్లకే బీ…
వ్యాపారరంగంలో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా ఇప్పుడు రూరల్ ఇండియాపై దృష్టి సారించారు. రూరల్ ఇండియాలో రైతులు పండించిన పంటను చిన్న చిన్న వాహనాలపై ఓవర్ లోడ్ చేసుకొని తీసుకొని వెళ్తుంటారు. డిమాండ్ ఉన్న వాహనాల్లో పంటను పెద్ద ఎత్తున ఓవర్ లోడ్ చేసుకొని వెళ్తుంటారని, ఓవర్ లోడ్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రూరల్ ఇండియాలో డిమాండ్ ఉన్న వాహనాలను ఓవర్ లోడ్‌కు తగిన విధంగా మార్పులు చేయాలని, డిజైన్…
కరోనా వైరస్ ఆదిలో మెజార్టీ కేసులు సిటీలు, పట్టణ ప్రాంతాల్లో వెలుగు చూడగా… సెకండ్‌వేవ్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది… నగరాలు, పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూడడం సవాల్‌గా మారిపోయింది.. అయితే, దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.. దేశంలో గ్రామీణ ప్రాంతాలలో వేగంగా కరోనా విస్తరిస్తోండగా.. వైద్య సదుపాయాల కొరతతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు..…