టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయింది. డిజిటలైజేషన్ వినియోగంలోకి రావడంతో నగరాలు, పట్టణాల్లో స్మార్ట్ ఫోన్లను అధికంగా వినియోగిస్తున్నారు. ఒకప్పుడు కేవలం నగరాలకు మాత్రమే పరిమితమైన మొబైల్ ఫోన్లు ఇప్పుడు పట్టణాలు, గ్రామాలకు విస్తరించాయి. గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచంలో తయారైన కొత్తకొత్త మోడళ్లు దేశానికి దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్ ఫోన్లు చాలా తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో వినియోగం పెరిగిపోయింది.
Read: Revanth Reddy : కోట్లాడిన వాళ్లకే బీ ఫామ్.. కోటా లేదు.. వాటా లేదు..
2021 గణాంకాల ప్రకారం, దేశంలో 1.2 బిలియన్ మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఇందులో 750 మిలియన్ మంది ప్రజలు స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఇండియా రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ దేశంగా మారనున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2026 నాటికి రూరల్ ఇండియాలో స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరుగుతుందని, 2026 వరకు దేశంలో స్మార్ట్ ఫోన్ల సంఖ్య 1 బిలియన్ లకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.