కరోనా సెకండ్‌వేవ్ భారత్‌లో కల్లోలమే సృష్టిస్తోంది.. కేసులు ఇవాళ కాస్త తగ్గినా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఇంకా 3 లక్షలకు పైగానే ఉంది.. రికవరీ కేసులుపెరిగినా.. మృతుల సంఖ్య కలవరపెడుతూనే ఉంది.. ఇక, కరోనా కేసులు, చికిత్స, వ్యాక్సినేషన్‌పై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ కీలక సూచనలు చేశారు.. కరోనా కట్టడిపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వారానికి 50 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షల నుంచి 1.3 కోట్ల టెస్టులు చేస్తున్నామని తెలిపారు.. ఇక, సెకండ్‌వేవ్ లో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆయా రాష్ట్రాలు టెస్టులు పెంచాలని సూచించారు.. గ్రామీణ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలన్న ఆయన.. ఇంటింటి సర్వే, టెస్టింగ్ జరపడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.