భారత్‌పై పాకిస్థాన్ విషం చిమ్ముతూనే ఉంది. ఐక్యరాజ్యసమితిలో రామ మందిర అంశాన్ని మరోసారి లేవనెత్తింది. అయితే, ఈసారి అయోధ్య రామమందిరాన్ని మానేసినట్లు పాక్ తెలిపింది.
UN Security Council: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్‌సీ) సంస్కరణపై మరోసారి భారత్ గళం విప్పింది. భద్రతా మండలి సంస్కరణలు చేపట్టాలని కోరింది. ఐరాసలో శాశ్వత ప్రతినిధి రుచిక కాంబోజ్ శనివారం న్యూయార్క్‌లో జరిగిన 78వ సెషన్ అనధికార సమావేశంలో యూఎన్ఎస్‌సీ సంస్కరణ ఆవశ్యతను ఎత్తి చూపారు. అర్ధశతాబ్ధంకి పైగా వీటిపై చర్యలు కొనసాగుతున్నాయని, ప్రపంచం మరియు భవిష్యత్ తరాలు ఇకపై వేచి ఉండలేవని అన్నారు.
గత ఐదు నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందించారు. గాజా పరిస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. దాదాపు ఐదు నెలలుగా గాజాలో జరుగుతున్న యుద్ధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రుచిరా కాంబోజ్ తెలిపారు.
India at UN: భారతదేశం మరోసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) నిర్మాణంపై నిలదీసింది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి, రుచిరా కాంబోజ్ భద్రతా మండలి యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని ప్రశ్నించారు. ఐదు దేశాలు ఇతర దేశాలను ఇతరుల కన్నా ఎక్కువ చేయడం ద్వారా ఐక్యరాజ్యసమితి అందర్ని కలుపుకుపోవడం లేదని చెప్పింది. యూఎన్ లో ప్రపంచ శాంతి కోసం జరిగిన బహిరంగ చర్చ సందర్భంగా కాంబోజ్ మాట్లాడారు.
దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులకు అంతర్జాతీయ సరిహద్దుల గుండా పాకిస్థాన్ ఆయుధాలు పంపడాన్ని అంతర్జాతీయంగా ఖండించాలని భారత్ పిలుపునిచ్చింది. డ్రోన్‌లను ఉపయోగించి అక్రమ ఆయుధాల సరఫరాను సీమాంతరంగా సరఫరా చేయడంలో తాము తీవ్రమైన సవాలును ఎదుర్కొంటున్నామని భద్రతా మండలికి భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు.
India at UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ జమ్మూ కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగానే స్పందించింది. మహిళలు, శాంతి మరియు భద్రతపై భద్రతా మండలి చర్చలో పాక్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ మానవహక్కులపై తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలపై భారత్ విరుచుకుపడింది. ఇటువంటి ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు భారత్ స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
డిసెంబర్ నెలలో 15 దేశాల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భ్రమణ అధ్యక్ష పదవిని భారతదేశం గురువారం స్వీకరించింది. ఈ సమయంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పలు ఈవెంట్‌లను భారత్ నిర్వహించనుంది.
Efforts to sanction terrorists behind 26/11 blocked for political reasons, says india: యావత్ భారతాన్ని భయాందోళకు గురి చేశాయి 26/11 ముంబై దాడులు. దాడులు జరిగి 14 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికే ప్రధాన సూత్రదారులైన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ లో దర్జాగా తిరుగుతున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ చర్యలు తీసుకోవడం లేదు. దాడిలో పాల్గొని దొరికిన ఒకే ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను భారతప్రభుత్వం ఉరి తీసింది. అయితే…
India slams Pakistan for raking up Kashmir issue at UN: మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సంస్కరణల గురించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే భారత్ దీనికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ అబద్దాలను ప్రచారం చేయడానికి తెగించి ప్రయత్నాలు చేస్తుందంటూ స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగంగా…