India slams Pakistan for raking up Kashmir issue at UN: మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సంస్కరణల గురించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే భారత్ దీనికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ అబద్దాలను ప్రచారం చేయడానికి తెగించి ప్రయత్నాలు చేస్తుందంటూ స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగంగా ఉందని యూఎన్ లో భారతదేశ శాశ్వత మిషన్ ప్రతినిధి ప్రతీక్ మాథూర్ అన్నారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు.. ఈ వ్యాఖ్యలే కారణం..
అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా పాకిస్తాన్ వేదికను దుర్వినియోగం చేస్తుందని భారత్ వ్యాఖ్యానించింది. అంతకుముందు ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి, రాయబారి రుచిరా కాంబోజ్ యూఎన్ భద్రతామండలి ప్రాతినిథ్యంపై జీ4 దేశాల ప్రతిపాదనను అందించారు. భద్రతామండలిలో సంస్కరణలు చాలాకాలంగా నిలిచిపోయాయని ఆమె అన్నారు. జీ4 దేశాలు అయిన బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇండియాల తరుపున రుచికా కాంజోజ్ మాట్లాడారు.
భారతదేశానికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని చాలా రోజుల నుంచి కోరుతోంది. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకేలు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. అయితే చాలా కాలం నుంచి భారత్ తో పాటు మరికొన్ని దేశాలు భద్రతామండలిని సంస్కరించాలని కోరుతున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ కు ఇందులో సభ్యత్వం లేకపోవడం భద్రతా మండలికి నిండుతనం తీసుకురాలేదని భారత్ పలుమార్లు యూఎన్ లో వ్యాఖ్యానించింది. అయితే చైనా తప్పా.. మిగతా నాలుగు దేశాలు యూఎన్ లో భారత్ కు శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం తన వీటో అధికారంలో భారత్ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది.