బహుజనుల బతుకులు మారాలంటే వంద శాతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బహుజనులు కేంద్రంగా కొత్త పార్టీ రావాలన్నారు. తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదు, సంపద అంతా ఒక్క శాతం మంది దగ్గర ఉందని, 99 శాతం మందికి తాయీలాలతో నడిపిస్తున్నారన్నారు. ‘దళిత బంధు’ చర్చలకు నాకు ఆహ్వానం లేదు అని తెలిపారు. రాజకీయాల్లోకి రావడం ఖాయం అని తేల్చేశారు. ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఆరేళ్ళ…
ఐపీఎస్ పదవికి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. 26 ఏళ్లుగా తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్… తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీగా సేవలు అందించారు. స్వచ్ఛందంగా పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. తన మనసుకు ఇష్టమైన పనులు తనకు ఇష్టమైన రీతిలో చేయబోతున్నానని తెలిపారు. అయితే,…