ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ..? ఆయనే క్లారిటీ ఇచ్చారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎస్ పదవికి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. 26 ఏళ్లుగా తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్… తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీగా సేవలు అందించారు. స్వచ్ఛందంగా పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. తన మనసుకు ఇష్టమైన పనులు తనకు ఇష్టమైన రీతిలో చేయబోతున్నానని తెలిపారు. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు ఈ పరిణామం జరగడంతో.. బై పోల్ కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఆయన త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది.. దళితుల ఓట్లను టార్గెట్ చేసిన టీఆర్ఎస్.. మంచిపేరున్న ప్రవీణ్ కుమార్‌ను బరిలోకి దింపితే ఈజీగా విజయం సాధించొచ్చు అనే ఆలోచన చేస్తుందనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో మొదలైంది. అయితే, దానిపై క్లారిటీ ఇచ్చారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే చేప్పలేనన్న ఆయన.. హుజురాబాద్ ఉప ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశం నాకులేదని స్పష్టం చేశారు.. పేదల పక్షాన ఉండాలనే పదవీ విరమణ చేశానని.. స్వేరోస్ లోని విద్యార్ధులేవరూ అధైర్యపడొద్దు.. నాకంటే మంచి అధికారులు వస్తారన్నారు. దీంతో.. ప్రవీణ్‌కుమార్ పొలిటికల్ ఎంట్రీపై సాగుతున్న ప్రచారానికి తెరపడినట్టు అయ్యింది.
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!