Srikalahasti: శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఇక, కాళహస్తీ ఆలయంలో 50 రూపాయల టికెట్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.