రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ జనం ముందు నిలచి దాదాపు నలభై రోజులు అవుతోంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజుల్లో డిఫరెంట్ టాక్ తోనే సాగింది. అయితే ట్రేడ్ పండిట్స్ మాత్రం ‘ట్రిపుల్ ఆర్’ ఈ యేడాది టాప్ గ్రాసర్ గా నిలుస్తుందని ముందే చెప్పారు. అదే జరుగుతోంది. ఈ యేడాది వెయ్యి కోట్లు చూసిన తొలి చిత్రంగా ‘ట్రిపుల్ ఆర్’ నిలచింది. ఇన్నాళ్ళకు ఈ సినిమాను చూసి ప్రముఖ హిందీ నటులు అనిల్ కపూర్, అనుపమ్…
కళలకు, కళాకారులకు హద్దులన్నవి లేవని ఈ ‘గ్లోబలైజేషన్’ అవతరించక మునుపే పెద్దలు చాటింపు వేశారు. దాంతో ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టడానికి జనం సైతం సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలోనూ మన దేశంలో ఓ కువిమర్శకుడు ఉత్తరం, దక్షిణం అన్న భేదాలు చూపిస్తూ తన కుల్లును బయటపెట్టుకుంటున్నాడు. తనకు తాను విమర్శకుడినని ప్రకటించుకున్న కమాల్ ఆర్. ఖాన్ మొన్న ‘ట్రిపుల్ ఆర్’ విడుదలైన సమయంలో బాలీవుడ్ లో ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాగానే, తట్టుకోలేక…
RRR మూవీ మేనియా ఇంకా తగ్గనేలేదు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ స్టోరీ ‘ఆర్ఆర్ఆర్’కు ఇండియాలో అద్భుతమైన స్పందన రాగా, ఇతర దేశాల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా రామ్ చరణ్ ఒకానొక సందర్భంలో వెల్లడించారు. ఆ సంగతిని పక్కన పెడితే తాజాగా యూకేలో ‘ఆర్ఆర్ఆర్’ ఫ్రీ షోలను ప్రదర్శించారు మేకర్స్. గత రాత్రి యూకేలో ఆర్మ్డ్ ఫోర్సెస్ మీడియా అయిన బ్రిటిష్ ఫోర్సెస్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్‌కు RRR మూవీని ఉచితంగా…
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే అది కేవలం సినిమా వరకే స్పెషల్ కాదు.. అన్నిటిలోనూ జక్కన్న మార్కు ఉండాల్సిందే. ప్రమోషనల్స్ అయినా, ప్రమోషనల్ సాంగ్ లోనైనా ఆ మ్యాజిక్ కనిపిస్తూనే ఉంటుంది. ఇక రాజమౌళి లో ఉన్న మరో స్పెషల్ ఏంటంటే.. తాను దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఒక్క షాట్ లోనైనా కనిపించి మెప్పిస్తూ ఉంటాడు. అది సీన్ అయినా.. ప్రమోషనల్ సాంగ్ అయినా రాజమౌళి కనిపించాల్సిందే. ‘మగధీర’ దగ్గరనుంచి ‘ఆర్ఆర్ఆర్’ వరకు జక్కన్న…
మన దేశంలో పాన్ ఇండియా మూవీస్ క్రేజ్ కు ‘ట్రిపుల్ ఆర్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలు మరింత ఊపు తెచ్చాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ యేడాది ఈ రెండు చిత్రాలు దక్షిణాది సినిమా రంగం ప్రతిభను దశదిశలా చాటాయని ట్రేడ్ పండిట్స్ సైతం అంగీకరిస్తున్నారు. ఉత్తరాదిన ఈ సినిమాలు హిందీ చిత్రాలను కూడా పక్కకు నెట్టి అగ్రపథంలో పయనించడం విశేషం! నార్త్ ఇండియాలో హిందీ ‘ట్రిపుల్ ఆర్’ కంటే ‘కేజీఎఫ్- 2’ హిందీ వెర్షన్ ఎక్కువ మొత్తం చూసిందని…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ సినిమాలతోనే వార్తల్లో ఉండే జక్కన్న ఈసారి మాత్రం ఓ కొత్త కారణంతో అందరి దృష్టిని ఆకర్షించారు. జక్కన్న గ్యారేజ్ లోకి కాస్ట్లీ కారు వచ్చి చేరింది. దానికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ కారును రాజమౌళి స్వయంగా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25 న రిలీజైన ఈ సినిమా మరోసారి తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చూపించింది. ఒకటి కాదు రెండు కాదు 1000 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఒక్కటొక్కటిగా ఫుల్ వీడియో సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే…
ప్రస్తుతం భారతీయ దర్శకుల్లో మన తెలుగువాడయిన ఎస్.ఎస్.రాజమౌళి పేరు మారుమోగి పోతోంది. తన తాజా చిత్రం ‘ట్రిపుల్ ఆర్’తో రాజమౌళి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటి దాకా ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1084 కోట్లు పోగేసింది. భారతదేశంలో విడుదలైన అన్ని భాషల్లో కలిపి ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం రూ. 880.4 కోట్లు మూటకట్టింది. ఇక విదేశాలలో ఈ సినిమా రూ.203.6 కోట్లు రాబట్టింది. వెరసి మొత్తం రూ.1084 కోట్లు కొల్లగొట్టి, ఈ యేడాది…
ఇంటర్వ్యూ వీడియోతో “ఆచార్య” ప్రమోషన్లను స్టార్ట్ చేశారు టీం. తాజాగా రామ్ చరణ్, కొరటాల శివ ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులు చెర్రీ, చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడే ‘ఆచార్య’ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి వచ్చింది. మాములుగా జక్కన్న తన సినిమా పూర్తయ్యేదాకా హీరోలను బయట ప్రాజెక్టుల్లో అడుగు పెట్టనివ్వడు. మరి చెర్రీ రెండు సినిమాలను ఎలా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాజాగా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో కన్పించారు. అక్కడ ఆమె భర్త చెర్రీ కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన “కృతజ్ఞతా భావంగా Mr.C అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు. ఆయన RC15 Rc షూటింగ్ లో బిజీగా ఉండడం మూలంగా, ఈ సేవలో చెర్రీ తరపున పాల్గొనే…