దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ సినిమాలతోనే వార్తల్లో ఉండే జక్కన్న ఈసారి మాత్రం ఓ కొత్త కారణంతో అందరి దృష్టిని ఆకర్షించారు. జక్కన్న గ్యారేజ్ లోకి కాస్ట్లీ కారు వచ్చి చేరింది. దానికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ కారును రాజమౌళి స్వయంగా కొనుగోలు చేశారు. ఇటీవల రెడ్ కలర్ వోల్వో ఎక్స్‌సి 40 కారును ఆర్డర్ చేయగా, కారు కంపెనీ హైదరాబాద్‌లోని రాజమౌళి నివాసానికి కారును డెలివరీ చేసింది. ఈ కారు ఖరీదు దాదాపు రూ. 45 లక్షలు. మూడ్రోజుల క్రితమే కారు జక్కన్న ఇంటికి చేరగా, ఆ సమయంలో దిగిన పిక్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Read Also : Doctor Strange in the Multiverse of Madness : సౌదీలో బ్యాన్… ఎందుకంటే ?
ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో “SSMB 28″ను పూర్తి చేసి, ఆ తరువాత రాజమౌళి సినిమాకు షిఫ్ట్ కానున్నారు మహేష్.