RRR మూవీ మేనియా ఇంకా తగ్గనేలేదు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ స్టోరీ ‘ఆర్ఆర్ఆర్’కు ఇండియాలో అద్భుతమైన స్పందన రాగా, ఇతర దేశాల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా రామ్ చరణ్ ఒకానొక సందర్భంలో వెల్లడించారు. ఆ సంగతిని పక్కన పెడితే తాజాగా యూకేలో ‘ఆర్ఆర్ఆర్’ ఫ్రీ షోలను ప్రదర్శించారు మేకర్స్. గత రాత్రి యూకేలో ఆర్మ్డ్ ఫోర్సెస్ మీడియా అయిన బ్రిటిష్ ఫోర్సెస్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్‌కు RRR మూవీని ఉచితంగా చూపించారు. ఇందులో స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ వాళ్ళ కర్కశత్వం గురించి జక్కన్న ప్రత్యేకంగా చూపించిన విషయం తెలిసిందే.
Read Also : Mega154 : టైటిల్ లీక్ చేసిన మెగాస్టార్
RRR మార్చి 24న థియేటర్లలో విడుదల కాగా, ఇప్పటికి ఈ సినిమా సృష్టించిన సంచలనం కొనసాగుతోంది. దాదాపు 1000 కోట్లు సాధించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటించారన్న విషయం తెలిసిందే. మూవీకి కీరవాణి సంగీతం అందించగా, అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరో 30 దేశాల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధం అవుతోంది.