మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కన్పించాడు. ఆ పిక్స్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” చివరి షెడ్యూల్ ని ఉక్రెయిన్ లో ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఈ రోజు ఉదయం ఆయన ఎయిర్ పోర్టులో కంపించడంతో కెమెరాలు క్లిక్ అన్నాయి. చరణ్ బ్లాక్ హూడీ, బ్లాక్ జీన్స్ ధరించి, మ్యాచింగ్ మాస్క్, టోపీ ధరించాడు. అయినప్పటికీ అభిమానులు ఆయనను గుర్తు పట్టేశారు. మిగతా “ఆర్ఆర్ఆర్” టీం…
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆగష్టు మొదటి వారంలో సినిమా చివరి షెడ్యూల్ కోసం హీరోలతో సహా “ఆర్ఆర్ఆర్” టీం మొత్తం ఉక్రెయిన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిన్న పూర్తయ్యింది. దీంతో నిన్ననే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేశారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ హైదరాబాద్ విమానాశ్రయంలో క్యాజువల్ లుక్ లో కన్పించిన పిక్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి.…