కళావేదిక అవార్డ్స్ 59వ వార్షికోత్సవం సందర్భంగా బస్సా శ్రీనివాస్ గుప్త, భువన గారి ఆధ్వర్యంలో గీతరచయితలకు, గాయనీగాయకులకు, సంగీతదర్శకులకు అవార్డులు అందించడం జరిగింది. ఆర్.వి. రమణమూర్తి గారు ఎటువంటి ఆశయాల మేరకు కళావేదికను స్థాపించారో ఆ ఆశయాలను ఆయన కుమార్తె భువన గారు సఫలం చేస్తూ ఈ అవార్డుల కార్యక్రమం నిదర్శనంగా చెప్పవచ్చు. జనవరి 4వ తేదీన హైదరాబాద్ లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వాసవి గ్రూప్స్, ఉప్పల ఫౌండేషన్, మనెపల్లి…
RP Patnaik’s Trigger Short film got qualification for the entry into “THE OSCARS”: ఒరిస్సాలో జన్మించిన ఆర్పీ పట్నాయక్ మాతృభాష తెలుగయినా ఆయన తండ్రి ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉండేవారు. ఇక ఆంధ్రా యూనివర్సిటీ నుండి స్పేస్ ఫిజిక్స్ లో పీజీ చేశాక, ఆర్పీ మనసు చెప్పినట్టు విని సినిమా రంగంలో అడుగుపెట్టి 99లో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీ కోసం’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. డైరెక్టర్ తేజ తన దర్శకత్వంలో…
దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'అహింస' మరోసారి వాయిదా పడేట్టుగా ఉంది. ఈ శుక్రవారం 'రావణాసుర, మీటర్' చిత్రాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ దీనిని వాయిదా వేశారని తెలుస్తోంది.
దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కించిన 'అహింస' మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే ఆ తేదీన రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' చిత్రాలు విడుదల కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ప్రతిభ ఉండాలే కానీ, చిత్రసీమ ఏదో ఒకరోజున పట్టం కట్టకుండా మానదు అన్నది నానుడి. ఆ మాటను నమ్మి ఎందరో చిత్రసీమలో రాణించాలని కలలు కంటూ అడుగు వేస్తుంటారు. స్పేస్ ఫిజిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ కు కూడా సినిమా రంగంలో వెలిగిపోవాలనే ఆశ ఉండేది. ఆయన ఆశయం దర్శకుడు కావాలన్నది. అయితే చిత్రసీమ చిత్రవిచిత్రాలకు వేదిక. ఆర్పీ పట్నాయక్ డైరెక్టర్ కావాలని అడుగులు వేసినా, అంతకు ముందు నేర్చుకున్న సంగీతం…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది. అయితే ఇప్పుడు అభిమానులతో పటు అందరూ ఆయన యాక్సిడెంట్ కు గల కారణం గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పోలిసుల ప్రాధమిక విచారణలో ఆయన అతివేగం, ర్యాష్ డ్రైవింగే యాక్సిడెంట్ కు కారణమని వెల్లడింది. ఈ మేరకు ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. సాయి ధరమ్ యాక్సిడెంట్ కేసు లో పోలీసులకి కొన్ని అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు…
టీవీ సీరియల్స్ లో సినిమా సెలబ్రిటీలు కనిపించటం కొత్తేం కాదు. పూర్తి స్థాయి పాత్రల్లో సీరియల్స్ చేసే వారు ఎలాగూ ఉంటారు. కానీ, అప్పుడప్పుడూ పెద్ద తెరపై బిజీగా ఉన్న వారు కూడా బుల్లితెరకు అతిథులుగా వచ్చేస్తుంటారు. విచ్చేస్తుంటారు. తెలుగులో ఇలాంటి ప్రయోగాలు తక్కువే కానీ హిందీ సీరియల్స్ లో చాలా మంది ఆర్టిస్టులు, దర్శకులు సక్సెస్ ఫుల్ సీరియల్స్ లో కనిపించి వెళుతుంటారు. ప్రమోషన్స్ కోసమైనా సరే అప్పుడప్పుడు టాప్ స్టార్స్ కూడా సీరియల్స్ లో…
ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “చిత్రం” నేటితో 21 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతోనే ఆయన ఉదయ్ కిరణ్, రీమాసేన్ లను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ తో తేజ చేసిన ప్రయత్నం సక్సెస్ ఫుల్ అయ్యింది. ఒక మధ్య తరగతి యువకుడు, ఆధునిక భావాలున్న యువతి ప్రేమలో పడతారు. కాలేజీలో చదువుతుండగానే హీరోయిన్ గర్భవతి అవుతుంది. కానీ ఆ గర్భాన్ని తొలగించుకోవడానికి ఆమె ఒప్పుకోదు. దీంతో…