మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది. అయితే ఇప్పుడు అభిమానులతో పటు అందరూ ఆయన యాక్సిడెంట్ కు గల కారణం గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పోలిసుల ప్రాధమిక విచారణలో ఆయన అతివేగం, ర్యాష్ డ్రైవింగే యాక్సిడెంట్ కు కారణమని వెల్లడింది. ఈ మేరకు ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. సాయి ధరమ్ యాక్సిడెంట్ కేసు లో పోలీసులకి కొన్ని అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కొంతమంది సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Read Also : సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు ఆ పార్టీనే కారణమా ?
ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ ఆర్పీ పట్నాయక్ మాత్రం సాయి ధరమ్ తేజ్ పై కేసు పెట్టడం ఓకే కానీ దానికి కారణమైన మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేయాలంటూ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. “సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు, అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన అక్కడ ఉన్న కన్ స్ట్రక్షన్ కంపెనీపై, అలాగే రోడ్లు క్లీన్ ఉంచాల్సిందే మున్సిపాలిటీ పై కూడా కేసు పెట్టాలి. ఈ కేసు వల్ల నగరంలోని మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించే వాళ్ళు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారని నా అభిప్రాయం” అంటూ ట్వీట్ చేశారు.