జానపద గాయకులకు బంగారు అవకాశం కల్పిస్తోంది సారంగ దరియా . ఈ వినూత్న కార్యక్రమం ద్వారా వెలుగులోకి రాని అనేక జానపద గీతాలకు ప్రాచుర్యం కల్పించనుంది వనిత టీవీ. సారంగ దరియా ఎపిసోడ్ -01 అందరినీ అలరించేలా వుంది. ప్రారంభంలోనే అందరినీ ఆకట్టుకుంది. అద్భుతమయిన సెట్ తో అలనాటి మరుగున పడిన జానపదాలకు పట్టం కడుతోంది వనిత టీవీ సారంగదరియా ప్రోగాం.
ప్రముఖ యాంకర్ శ్రీముఖి అభినయం, సెన్సాఫ్ హ్యూమర్ హైలైట్ అని చెప్పాలి. మనిషి ఊసుపాట.. మనిషి గోస పాట.. మనిషి బతుకుల్ని మట్టిలో అలికితే మొలకెత్తే పాట జానపదం. ఈ లేటెస్ట్ టెక్నాలజీ జీవితంలో జానపదాలను ఎవరూ మరిచిపోకుండా.. జానపదాల గతుల్ని.. సంగతుల్ని మీ ముందుకు తెస్తోంది. శ్రావ్యమయిన అచ్చతెలుగు జానపదాలు ఇక నుంచి మీకు సారంగ దరియా ద్వారా అలరించనున్నాయి. ప్రతివారం ఈ ఎపిసోడ్ మిస్ కాకుండా చూడండి.