టీవీ సీరియల్స్ లో సినిమా సెలబ్రిటీలు కనిపించటం కొత్తేం కాదు. పూర్తి స్థాయి పాత్రల్లో సీరియల్స్ చేసే వారు ఎలాగూ ఉంటారు. కానీ, అప్పుడప్పుడూ పెద్ద తెరపై బిజీగా ఉన్న వారు కూడా బుల్లితెరకు అతిథులుగా వచ్చేస్తుంటారు. విచ్చేస్తుంటారు. తెలుగులో ఇలాంటి ప్రయోగాలు తక్కువే కానీ హిందీ సీరియల్స్ లో చాలా మంది ఆర్టిస్టులు, దర్శకులు సక్సెస్ ఫుల్ సీరియల్స్ లో కనిపించి వెళుతుంటారు. ప్రమోషన్స్ కోసమైనా సరే అప్పుడప్పుడు టాప్ స్టార్స్ కూడా సీరియల్స్ లో సర్ ప్రైజ్ గెస్టులుగా అలరిస్తుంటారు. దాని వల్ల హీరోలు, హీరోయిన్స్ కి సినిమా పబ్లిసిటీ, ఇటు సీరియల్ మేకర్స్ కి బోలెడు కొత్తదనం…ఇంకేం కావాలి?
Read Also : షకీలా చనిపోయింది… క్లారిటీ ఇచ్చిన నటి
హిందీలో ఎక్కువగా జరిగే గెస్ట్ అప్పియరెన్స్ హంగామా తెలుగులోనూ త్వరలో జరగబోతోంది! జీ తెలుగు సీరియల్ ‘కృష్ణ తులసీ’లో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శనం ఇవ్వబోతున్నాడు. ఆయన కనిపించబోయే సన్నివేశంతో తాజాగా ఛానల్ వారు ప్రోమో రిలీజ్ చేశారు. దీనికి నెటిజన్స్ లో మంచి స్పందన వస్తోంది!
A post shared by Zee Telugu (@zeetelugu)