బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సీబీఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.
జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను జైలు అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 23 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది
కవిత జ్యుడీషియల్ రిమాండ్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను జైలు అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. రోస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్‌ను నిరాకరిస్తూ ఇవాళ ఉదయం తీర్పు వెలువరించింది.
MLC Kavitha: ఏప్రిల్ 9 వరకు ఎమ్మెల్సీ కవితకు స్పెషల్ కోర్ట్ జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కవిత మధ్యంతర బెయిలుపై ఒకటో తేదీన విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కవితను అధికారులు జైలుకు తరలిస్తున్నారు.
కేజ్రీవాల్‌ను ఇవాళ ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పర్చనున్నారు. విచారణ కోసం ఈడీ ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. దాదాపు 13 రోజుల పాటు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది.
MLC Kavitha: తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని అన్నారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత.